రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ  గత కొన్ని నెలలుగా విస్తృతంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవ్‌గన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో విస్తృతంగా జరుగుతోంది. 


ఈ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ లో, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వరుసగా కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామ రాజు పాత్రలను పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఎస్ఎస్ రాజమౌలి తన రాబోయే చిత్రం ఆర్ఆర్ఆర్  యొక్క పూర్తి పేరు ను జనవరి 1 న న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడిస్తారని చెబుతున్నారు. రాజమౌళి న్యూ ఇయర్ ట్రీట్ తో వస్తున్నారని, జనవరి 1 న ఆయన ఆర్ఆర్ఆర్ టైటిల్ ను వెల్లడిస్తారని ఫిల్మ్ యూనిట్ దగ్గరి వర్గాలు వెల్లడించాయి.


జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మొదటిసారిగా తెరపై కలిసి పనిచేస్తున్నారు మరియు అది కూడా ఎస్.ఎస్.రాజమౌళి చిత్రంలో, రాజమౌళి యొక్క గత చిత్రం  బాహుబలి చారిత్రక బ్లాక్ బస్టర్ గా నిలిచింది , రూ 1820 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. అందువల్ల, ఈ రాబోయే చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి చాలా హైప్, ఉత్సుకత మరియు నిరీక్షణ ఉంది. 


ఇటీవల ఆర్.ఆర్.ఆర్ అభిమానుల పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అభిమానులు ఆర్.ఆర్.ఆర్ అంటే పూర్తి పేరు  ‘రామ రౌద్రా రుషితం’ అని  వెల్లడించారు. ఈ టైటిల్ మరీ నిజమో కాదో తెలీదు కానీ టాలీవుడ్ వర్గాలు మాత్రం ఇదే ఆర్.ఆర్.ఆర్ పూర్తి పేరు అని చెవులు కోరుకుంటున్నాయి. ఇప్పుడు అందరి కళ్ళు ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ విడుదలపై ఉన్నాయి. 2020 జనవరి 1 న  ఆర్ఆర్ఆర్ యొక్క పూర్తి పేరు మరియు  ఆర్.ఆర్.ఆర్ లో జూనియర్ ఎన్టిఆర్ మరియు రామ్ చరణ్ యొక్క ఫస్ట్ లుక్స్ ను వెల్లడిస్తారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: