అక్కినేని వారి కోడలు సమంత టాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న సంగతి తెలిసిందే. సమంత పెళ్ళి అయిన తరువాత కూడా వరసగా మూవీస్ చేస్తూ హిట్లు కొడుతున్న ఈ ముద్దు గుమ్మ కాల్షీట్లకు యమ డిమాండ్ ఉన్న సంగతి కూడా తెలిసిందే. రంగస్థలం మూవీని పెళ్ళి అయిన తరువాత చేసినా అందులో మాస్ రొమాంటిక్ లుక్స్ తో చంపేసింది.


ఇక ఓ బేబీ సినిమాలో తన నటనతో అదుర్స్  అనిపించేసింది. మరిన్ని సినిమాలు క్యూలో ఉండగానే సమంత ఇపుడు ఓ సంచనల నిర్ణయం  నిర్ణయం తీసుకోబోతోందిట. అదేమంటే సినిమాలకు గుడ్ బై చెప్పడానికి రెడీ అయిందని అంటున్నారు. సమంత ప్రస్తుతం శర్వానంద్ మూవీ 96 రీమేక్ లో నటిస్తోంది.


మూవీ అయిపోగానే సమంత కొత్త సినిమాలు ఏంటి అన్న చర్చ వస్తోంది. అయితే సమంత మాత్రం కొత్తగా ఏ మూవీకి సైన్ చేయకపోవడంతో అందరికీ డౌట్లు వస్తున్నాయి. సమంత ఇక సినిమాలు చేయదని అంటున్నారు. పెళ్ళి అయిన తరువాత కూడా వరసగా బిజీగా ఉన్న సమంత మనసు ఇపుడు పిల్లల మీదకు మళ్ళిందట. అందువల్ల సమంత మూవీస్ చేయడం లేదని అంటున్నారు.


కొన్నాళ్ళ పాటు కెమెరా వెలుగులకు దూరంగా ఉండాలని సమంతా అనుకుంటోందని కూడా అంటున్నారు. మరి అది కొన్నాళ్ళా లేక కొన్నేళ్ళా అన్నది చూడాల్సి ఉంది.  ఇక సమంత లాంటి మల్టిపుల్ టాలెంటెడ్ యాక్ట్రెస్ కనుక తప్పుకుంటే కొన్ని ఇన్నోవేటివ్ స్టోరీస్ కూడా తెరకెక్కేందుకు ఇబ్బంది అవుతుందని అంటున్న వారూ ఉన్నారు. ఇదిలా ఉండగా సమంతా కనుక మూవీస్ మానేస్తే టాలీవుడ్లొ కొత్త పోటీ మొదలవుతుంది. ఇప్పటికే  రేసులో పూజాతో పాటు చాలా మంది ఉన్నారు. ఎవరు రీప్లేస్ చేస్తారన్నది కూడా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: