సాధార‌ణంగా కొంద‌రు హీరోయిన్ల‌కు ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత మంది స్టార్ హీరోల‌తో న‌టించినా కూడా ఎందుకో కానీ పెద్ద‌గా ల‌క్ క‌లిసిరాదు. అయితే ఈ కోవ‌కే చెందిన హీరోయిన్  కృతి కర్బందా. వ‌రుస పెట్టి ఎన్ని సినిమాలు చేసినా స‌క్సెస్ అంద‌క‌పోవ‌డంతో `ఐరన్ లెగ్` అనే ప్రాపగండా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.  అయితే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇలా ఏ ఒక్క ఇండస్ట్రీతో సరిపెట్టుకోకుండా అన్ని ఇండస్ట్రీలు చుట్టేసింది కృతి కర్బందా. సుమంత్ సరసన బోణీ తెలుగు చిత్రంతో నట ప్రస్థానం ప్రారంభించింది. ఈ చిత్రం విజయవంతం కాకపోయినా ఆమెకు వెంటనే పవన్ కళ్యాణ్ సరసన తీన్‌మార్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. 


అలాగే తెలుగులో అలా మొదలైంది, మిస్టర్ నూకయ్య, తీన్‌మార్, ఒంగోలు గిత్త, ఓమ్ 3డీ, బ్రూస్‌లీ తదితర చిత్రాల్లో ఈ బ్యూటీ నటించింది. అయితే, ఈ సినిమాలేవీ ఈ భామకు కలిసి రాలేవు. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది కృతి. ఈ క్ర‌మంలోనే ఐరెన్ లెగ్ ముద్ర వేసి టాలీవుడ్ పక్కన పెట్టేసింది. దీంతో  దీంతో తెలుగు లో లాభం లేదని భావించిన కృతి తమిళ-కన్నడ- హిందీ భాషల్లో ప్రయత్నించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరికి డీగ్రేడ్ సినిమాల్లో చేసినా అవీ ఆకట్టుకో లేకపోయాయి.


అయితే ఇక కృతి కెరీర్ అయి పోయింది అనుకున్న వేళ `హౌస్ఫుల్ 4` చిత్రంతో భారీ విజయాన్ని అందుకోవడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో బాలీవుడ్‌లో మకాం వేసింది. అక్కడ మంచి ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం `పాగల్ పంతి` పూర్తి ఎంటర్టైన్మెంట్ నేపథ్యం లో రూపొందుతోంది. అదే విధంగా, మరిన్ని చిత్రాల్ని అంగీకరించిందట. ఇక కృతి స్పీడ్ చూస్తుంటే పోగొట్టుకున్న చోటే రాబట్టుకునేందుకు తిరిగి టాలీవుడ్ లో అడుగు పెట్టినా ఆశ్చర్య పోనక్కర్లేదని టాక్ వినిపిస్తోంది. ఇటు సినిమాల‌తో పాటు అప్పుడప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్‌ ఫోటోలతో అదరగొడుతోంది ఈ భామ‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: