బుల్లితెర యాంకర్ రష్మి గౌతం ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు నచ్చిన పని చేయడంలో ఎలాంటి మొహమాటం చూపించిన రష్మి తను చెప్పాలనుకున్న విషయాన్ని సైతం కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేస్తుంది. లేటెస్ట్ గా ఏడేళ్లుగా తనతో ఉన్న తన మేకప్ మెన్ వేణు గురించి ప్రస్థావించి అందరిని సర్ ప్రైజ్ చేసింది రష్మి.


తన పర్సనల్ మేకప్ మెన్ వేణు తనకు చాలా మంచి సపోర్ట్ అని.. ఆమె ఎక్కడ ఉంటే అతను అక్కడే ఉండే వాడని.. ఒక్కోసారి తనతో పాటుగా మేకప్ మెన్ కూడా రాత్రింబవళ్లు పన్ చేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది వేణు. తన ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా వేణు ఫ్యామిలీతో వస్తాడని.


అతని ఫ్యామిలీలో మెంబర్స్ అంతా కూడా చాలా స్వీట్ అని చెబుతుంది రష్మి. యాంకర్ గా స్టెప్ తీసుకున్న దగ్గర నుండి రష్మికి వేణునే పర్సనల్ మేకప్ మెన్ గా ఉంటున్నాడు. ఇప్పటికి రష్మికి అతనే మేకప్ మెన్ గా ఉంటున్నాడు. అతను కూడా తన ఫ్యామిలీలో భాగమయ్యాడని అంటుంది రష్మి. ఇక కెరియర్ విషయానికి వస్తే బుల్లితెర షోలతో పాటుగా సినిమాల్లో కూడా అమ్మడు బిజీగా ఉంది.  


సినిమాల్లో రష్మి గౌతం హాట్ షో ఆమె ఫ్యాన్స్ కు మరింత జోష్ ఇస్తుంది. ఇక రీసెంట్ గా రష్మి ఓ వెబ్ సీరీస్ కు కూడా సైన్ చేసినట్టు తెలుస్తుంది. అందులో ఆమె లెస్బియన్ పాత్రలో కనిపిస్తుందట. ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ అయినా సరే చేసేందుకు సిద్ధమంటున్న రష్మి లెస్బియన్ గా ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తుందో చూడాలి. శేఖర్ సూరి డైరక్షన్ లో వస్తున్న ఈ వెబ్ సీరీస్ గురించి మిగతా డీటైల్స్ ఇంకా బయటకు రాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: