అన్నికాల‌ల్లో చ‌లికాలం వ‌చ్చిందంటే  చాలా స‌మ‌స్య‌లుంటాయి. అందులో కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌ల‌యితే మ‌రికొన్ని చ‌ర్మ‌స‌మ‌స్య‌లు అని చెప్పాలి. చ‌లికి చాలా మంది చ‌ర్మం పొడిబారిపోతుంది. అలాగే చ‌లితీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల శ‌రీరం ఎక్క‌డిక‌క్క‌డ ప‌గుళ్ళు తెల్ల‌గా రావ‌డం దాంతో మంట పుట్ట‌డం లాంటివి జ‌రుగుతుంటాయి. దీనికి ఉప‌శ‌మ‌నంగా చాలా మంది కోల్డ్ క్రీమ్స్ లాంటివి వాడుతుంటారు. కానీ అది అంత‌గా మ‌న శ‌రీరానికి శ్రేయ‌స్క‌రం కాద‌ని కొంద‌రు నిపుణులు చెపుతున్నారు. స్నానానికి ముందు శ‌రీరం ప‌గ‌ల‌కుండా కొంద‌రు కొబ్బ‌రినూనెను రాసి మ‌ర్ద‌నా చేసి స్నానం చేస్తుంటారు దాని వ‌ల్ల మ‌నం న‌ల్ల‌గా అయ్యే ప్ర‌మాదం ఉంది. కొబ్బ‌రి నూనె బ‌దులు నువ్వుల నూనె రాయాలి అది కాస్త మ‌న శ‌రీరానికి తేమ‌ని ఎక్కువ‌గా అందిస్తుంది. స్నానం చెయ్య‌డానికి క‌నీసం గంట ముందు నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేసి కాసేపు అలా ఎండ‌లో కూర్చుంటే చాలా మంచిది. ఆత‌ర్వాత స్నానం చేసేట‌ప్పుడు స‌బ్బుకు బ‌దులుగా న‌లుగుపిండి లేదా శ‌న‌గ‌పిండితో ఒళ్ళు రుద్దుకుని స్నానం చేస్తే శ‌రీరం చాలా ఫ్రెష్‌గా మ‌రియు చ‌ర్మం పొడబార‌కుండా తేమ‌గా ఉంటుంది. 


అయితే వింటర్ సీజన్ లో స్ర్కబ్బింగ్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. డైలీ స్ర్కబ్బింగ్ వల్ల చర్మం మరింత డ్రైగా మారుతుంది. కాబట్టి వారంలో మన్నికైన స్ర్కబ్బర్ తో ఒకటి రెండు సార్లు చేసుకుంటే చాలు. ముఖ్యంగా కెమికల్ స్క్రబ్బర్ కంటే ఫ్రూట్ స్క్రబ్ ఎంపిక చేసుకోవడం మంచిది. బాగా పండిన అరటిపండు గుజ్జు 2 టేబుల్స్ స్పూన్లు, మ్యాష్ చేసి ఆపిల్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ తేనెను ఒక బౌల్లో వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో మర్ధన చేయాలి.యాంటీ సర్క్యులర్ మోషన్ లో 2 నిముషాలు మర్ధన చేసిన తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఎండ తీవ్రత తక్కువ ఉన్నా, మేగాల మద్యనుండి చొచ్చుకు వచ్చే, కంటికి కనబడని యూవి కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి, కాబట్టి, వింటర్ లో కూడా సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా ఉపయోగించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: