బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ పేరు అందరికి తెలిసిందే. ఎందుకంటే మన టాలీవుడ్ లో కూడా రాజ్ తరుణ్ తో 'రాజుగాడు'.. సందీప్ కిషన్ తో 'మనసుకు నచ్చింది' సినిమాలో హీరోయిన్ గా నటించి హీరోయిన్ గా పరవాలేదనిపించుకుంది. ఆ సినిమాలు చూసినవాళ్ళ కి ఖచ్చితంగా అమైరా తెలిసిన మొహమే. ఇక హిందీ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ జెనరేషన్ హాట్ అండ్ గ్లామర్ బ్యూటీల మాదిరిగా సోషల్ మీడియాలో జనాలకు వెర్రెక్కించడంలో టాప్ అని చెప్పాలి. నెటిజన్ల కోసం ఏదో ఒక ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలు పోస్ట్ చేస్తూ అందరి చూపు తన మీద పడేదాకా చేస్తుంటుంది.  

రీసెంట్ గా మరోసారి అదే ట్రెండ్ ఫాలో అవుతూ తన ఇన్స్టా గ్రాం ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు చాలా పెద్ద క్యాప్షన్ ఇచ్చింది. ఆ క్యాప్షన్ లో క్రక్స్ ను క్లుప్తంగా చెప్పుకుంటే 'స్టేజ్ 3 ఒక మంచి ఆలోచన. మనం వివాహాలకు.. పండగలు.. ఇతర వేడుకల్లో దుస్తులకు లెక్క లేనంత ఖర్చుపెడతాం. అయితే ఒక్కోసారి ఆ బట్టలు వేసిన తర్వాత రెండో సారి వాటిని వేసుకుంటామో లేదో తెలియదు. అందుకే ఇలాంటి ఖరీదైన దుస్తులను స్టేజ్ 3 ఉపయోగించి మనం రెంట్ కు తీసుకోవచ్చు. మనదగ్గర ఉండేవాటిని ఇతరులకు అద్దెకు ఇవ్వవచ్చు. స్టేజ్ 3 లో మీరు ఇలా ట్రై చెయ్యొచ్చు.'  అది మ్యాటర్ కాన్సెప్ట్ అర్థం అయిందా. స్టేజ్ 3 కి ఈ బ్యూటి ప్రమోషన్ చేస్తోంది. 
 
సరే ఈ బ్యూటి కాన్సెప్ట్ గురించి అందరికి తెలిసే ఉంటుంది కదా.. ఇక డ్రెస్ విషయానికి వస్తే క్రీమ్ కలర్ ఛోళి..  లెహెంగా ధరించింది.  డ్రెస్ కు సరిగ్గా మ్యాచ్ అయ్యే అభరణాలు ధరించి ఒక యువరాణి లెవల్ లో ఒక హాట్ ఫోజ్ ఇచ్చింది. గ్లామర్ ట్రీట్ కూడా బాగా ఉంది కనుక ఫాలోవర్స్ కు ఈ ఫోటో తెగ నచ్చింది. అందుకే మంచి కామెంట్లు పెట్టారు. 'కిల్లర్ ట్రీట్'.. 'బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్న బ్యూటీ' అంటూ కామెంట్లు పెట్టారు.ఇక ఈ హాట్ బ్యూటినటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తమిళంలో 'ఊడి ఊడి ఉళైకాణమ్'.. 'కాదలై తేడి నిత్యా నందా' సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో రెండు సినిమాలు చేసిన ఇప్పుడు కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తూ నెమ్మదిగా పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తోంది అమైరా.  


మరింత సమాచారం తెలుసుకోండి: