ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ నటిస్తున్నారు. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమర్షియల్ సినిమా తరహా లో రెగ్యులర్ ఫార్మాట్ లో పాటలు పెట్టే అవకాశం ఎంతమాత్రం లేదు. అందుకే ఈ సినిమా థీమ్ కు తగ్గట్టు మాత్రం పాటలు ఉంటాయంటు అటు చరణ్ ఇటు తారక్ ఫ్యాన్స్ ని ముందే జక్కన్న ప్రిపేర్ చేస్తున్నారు.

ఇక ఈ విషయం గురించి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో చరణ్.. ఎన్టీఆర్ పై రాజమౌళి పాటను ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట జానపదం అని తాజా సమాచారం. చరణ్.. ఎన్టీఆర్ ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్స్ కాబట్టి రాజమౌళి ఈ ఇద్దరిపై సూపర్ డ్యాన్సులు ఉండేలా పాట ప్లాన్ చేస్తారని ఈ స్టార్స్ కి సంబంధించిన ఫ్యాన్స్ ఆనందంగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ పాట కోసం ప్రత్యేకంగా ఒక సెట్ నిర్మాణం జరుగుతోందట. త్వరలోనే ఈ సెట్ లో పాట చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోందని చరణ్ పై బ్రిటిష్ జడ్జిలు ఉండే కోర్టు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తాజా సమాచారం.  

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్..బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్.. రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాహుబలి సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకున్న ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక డీవీవీ దానయ్య దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'బాహుబలి' ఫ్రాంచైజీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: