స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.


సామజవరగమన, రాములో రాముల సాంగ్స్ రెండు ఒకదానికొకటి పోటీ పడుతూ యూట్యూబ్ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుండి 3వ పాట రాబోతుంది. ఈ సాంగ్ తెలుగు ర్యాప్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మాస్ బీట్ తో తెలుగు ర్యాప్ అనగానే ఈ సాంగ్ మీద కూడా అంచనాలు పెరిగాయి. 


అయితే గురువారం నవంబర్ 14న ఈ సాంగ్ ప్రోమో వదులుతారని తెలుస్తుంది. అయితే ఈ సాంగ్ మేకింగ్ వీడియోలో అల్లు అర్జున్ వారసుడు అయాన్, అర్హలు సందడి చేస్తారని తెలుస్తుంది. ఈ సాంగ్ ప్రోమోలో వారిద్దరే హైలెట్ గా నిలుస్తారని తెలుస్తుంది. అయితే కేవలం సాంగ్ ప్రోమోలోనే వారు ఉంటారట సినిమాలో వారు ఉండరని అంటున్నారు.  


స్టార్ కిడ్స్ కు ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే.. అప్పుడప్పుడు అల్లు అర్జున్ తన పిల్లలు చేసే అల్లరి సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూనే ఉంటాడు. అయితే అయాన్, అర్హాలు కలిసి బన్ని సాంగ్ కు డ్యాన్స్ వేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమాలో టబు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తుంది. జనవరి 12న రిలీజ్ డేట్ అనుకున్నా ఒకరోజు ముందో వెనక్కో సినిమా వెళ్లే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: