హీరోయిన్స్ లో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండేది అనుష్క లా కొందరే. చాలామంది తలబిరుసు తనం చూపించే వాళ్లేనన్న రూమర్ స్ట్రాంగ్ గా ఉంది. డౌన్ టు ఎర్త్ ఉండే వారు తక్కువ మంది. తల బిరుసు చూపించే హీరోయిన్స్ స్నేహంగా ఉన్నారంటే అందుకు కొన్ని లెక్కలుంటాయి. కానీ కొంత మందిలో ఎలాంటి తారతమ్యాలుండవు.. హిడెన్ ఎజెండా ఉండదు. దిగువ మధ్య తరగతి వాళ్ళైనా స్నేహం కంటిన్యూ చేస్తుంటారు. వాళ్లతో  క్లోజ్ గా మూవ్ అవుతారు. అడగకుండానే సాయం చేస్తుంటారు. ఇలా ఇప్పటి వరకు ఎక్కువగా స్వీటి అనుష్క పేరే వినిపించింది. ఇప్పుడు మరో హాట్ యాంకర్ అండ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. యాంకర్ కమ్ హీరోయిన్ రష్మీ గౌతమ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

ఇక గుంటూరు టాకీస్, అంతకు మించి వంటి కొన్ని సినిమాల తోను ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.  అంతేకాదు రష్మీ కి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి కూడా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఉన్న యాంకర్స్ అందరిలో హాట్ భామగా బుల్లి తెరపై ఒక వెలుగు వెలుగుతోంది. మరి ఆమెను అంత అందంగా చూపించేది ఎవరు? అంటే..? ఇంకెవరు.. తన పర్సనల్ మేకప్ మేన్ అని చెబుతోంది. అతని పేరు వేణు. రష్మీ పర్సనల్ మేకప్ డిజైనర్. రష్మీ ఎక్కడుంటే అక్కడ వేణు ఉంటాడు. తనను అందంగా చూపించడమే వేణు పని. ఏడేళ్లుగా రష్మిని అందంగా చూపించడంలో అతనిది కీలక పాత్ర అని తెలుస్తోంది. వేణుని కేవలం ఒక ఉద్యోగి గా మాత్రమే కాకుండా తన కుటుంబంలో ఓ సభ్యుడి గా చూస్తానని చెబుతోంది రష్మి

తన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వేణు  ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడట. మేకప్ విషయంలో ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంటాడట. వేణు ప్రయోగాలను ఎంతో ఇష్టపడతానని.. తన అభిప్రాయాలు.. ఇష్టా ఇష్టాలు అన్నీ వేణు కి బాగా తెలుసని తెలిపింది రేష్మి. యాంకరింగ్ జాబ్ అంటే అంత ఈజీ కాదని.. ఒకేసారి నాలుగు ఎపిసోడ్లు కోసం గ్యాప్ లేకుండా రెండు రోజులు నిరంతరం పని చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఆ అలసట ఎక్కడా ముఖంలో కనిపించకుండా ఏడేళ్లు గా వేణు కాపాడుతున్నాడని సంబరపడుతోంది. ఇక వేణుతో రేష్మి సొంత అన్నయ్యా అన్న రిలేషన్ మేయిన్‌టేయిన్ చేస్తోందట. అంతేకాదు మన స్వీటి అనుష్క మాదిరిగా రష్మీకి దాన గుణం ఎక్కువే. 


మరింత సమాచారం తెలుసుకోండి: