విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది సినిమా యూనిట్. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ మరియు ఎస్ ఎస్ థమన్ సంగీత సారథ్యంలో స్వరపరిచిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకోవడం జరిగింది. 

ఇకపోతే ఈ సినిమా తరువాత వెంకటేష్ నటించబోయే తదుపరి సినిమా విషయమై ఇటీవల అనౌన్సుమెంట్ కూడా రావడం జరిగింది. ఇటీవల వి క్రియేషన్స్ బ్యానర్ పై కలై పులి ఎస్ థాను నిర్మాతగా వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అందుకున్న తమిళ సినిమా అసురన్. ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమాకి తమిళ ప్రేక్షకులు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇక ఈ సినిమా తెలుగు హక్కులను ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుని, వెంకటేష్ హీరోగా అతి త్వరలో దానిని తెరకెక్కించబోతున్నట్లు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. 

ఇక ఈ సినిమాకు ఇప్పటివరకు ఎక్కుగా క్లాస్ చిత్రాలనే తెరకెక్కించిన హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో వెంకటేష్ పూర్తి మాస్ స్టైల్ లుక్ లో దర్శనం ఇవ్వడంతో పాటు మంచి మాస్, యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో ఉండబోతున్నాయట. ఎప్పటినుండో వెంకీ ఫ్యాన్స్ ఆయన నుండి అసుస్తున్న అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని, ఒకరకంగా ఈ సినిమా వారికి ఫుల్ మీల్స్ వంటిదని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. మరి తమిళ్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, రేపు తెలుగులో రిలీజ్ అయి ఎంత మేర సక్సెస్ సాదిస్తుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: