సినిమా ఫీల్డ్ లో సెంటిమెంట్ కు కాదేదీ అనర్హం అన్నట్టు జరుగుతూంటుంది. సినిమా టైటిల్స్ విషయంలో కొందరు పాటించిన సెంటిమెంట్స్ చూస్తే.. కె. విశ్వనాధ్  దర్శకత్వంలో వచ్చిన “సిరివెన్నెల, స్వాతిముత్యం, స్వయంకృషి, సాగరసంగమం, శంకరాభరణం..” ఇలా చాలా సినిమాలకు ‘స,శ’ అక్షరాలతో టైటిల్స్ పెట్టారు. ఎమ్ఎస్ ఆర్ట్స్ మూవీస్ వారి సినిమాలు.. “అంకుశం, ఆహుతి, అమ్మోరు, అంజి, అరుంధతి..” ఇలా ఆ బ్యానర్ లో ‘అ’ అక్షరంతో సినిమా టైటిల్స్ ఉన్నాయి. త్రివిక్రమ్.. “అతడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అరవింద సమేత.., అల.. వైకుంఠపురంలో” తో ఆయన సినిమా టైటిల్స్ ఎక్కువగా ‘అ’ మీదే ఉన్నాయి.

 


రాఘవేంద్రరావు, దిల్ రాజు, బండ్ల గణేశ్.. వంటి వారు తమ సినిమా రిలీజ్ కు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. బోయపాటి శీనుకు సినిమాలో తొలిషాట్ లో కనిపిస్తాడు. ఈవీవీ తన సినిమాలో చిరంజీవికి సంబంధించిన టాపిక్ పెట్టేవారు. నిర్మాత సురేశ్ బాబు తమ ప్రొడక్షన్ సినిమాల్లో వెనుక నుంచో, ఆయన చేతులు మాత్రమో కపినించేలా నటిస్తారు. రామానాయుడు కూడా తమ ప్రతి సినిమాలో నటించేవారు. కొందరు హీరోయిన్లు తమ చేతి వేళ్లకు ఉంగరాలు ఉంచుకోవడం సింటిమెంట్.. మరికొందరికి తమ హ్యాండ్ బ్యాగ్ లో దేవుడి ఫొటోలు ఉంచుకోవడం సెంటిమెంట్. హీరో, హీరోయిన్ల పేర్లు కూడా సెంటిమెంట్ల ప్రకారమే పెట్టుకుంటారు.

 

 

సినిమా రిలీజ్ కూడా మొదటి షో ఎన్ని గంటలకు వేయాలో నిమిషాలతో సహా ఖచ్చితంగా పోస్టర్ల మీద వేసేవారు. ఇండస్ట్రీలోని దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఇలాంటి సెంటిమెంట్లను బలంగా నమ్ముతారు. సినిమా క్యాస్టింగ్ నుంచి టైటిల్, పాటలు, సీన్లు, లొకేషన్లు, రిలీజ్, మొదటి షో ముహూర్తం.. ఇలా ప్రతీ అంశంలో సెంటిమెంట్ లేకుండా ఏ సినిమా కూడా పూర్తవ్వదు.


మరింత సమాచారం తెలుసుకోండి: