టాలీవుడ్ ఆరు అడుగుల అందగాడు ప్రభాస్ తో నటించడానికి ఏ అమ్మాయి కైనా ఛాన్స్ వస్తే ఏం చేస్తుంది? ఎగిరి గంతేసి నటించడానికి ఒప్పుకుంటుంది మరి ప్రభాస్ క్రేజ్ అలాంటిది. మరి అలాంటి ప్రభాస్ తో నటించడానికి రకుల్ ప్రీత్ నో చెప్పేసింది వినడానికి ఆశ్చర్యం గా వున్న ఇది నిజం. కాని ఇది ఇప్పుడు జరిగిన సంగతి కాదు. 2011 లో జరిగిన సంగతి.
ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభాస్‌ 2011 లో నటించిన ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమా లో హీరోయిన్‌గా రకుల్‌ ఎంపిక అయింది. ఇక రకుల్ అప్పటికి సినిమాల మీద పెద్ద గా అవగాహన లేదు. ఎప్పటి నుంచో మిస్‌ ఇండియా అవ్వాలనే కోరిక ఉన్న రకుల్‌కు చిత్ర పరిశ్రమ గురించి పెద్దగా అవగాహన లేదు. మరోవైపు అప్పటికీ ఇంకా చదువుకుంటూనే ఉన్నారు. కానీ తండ్రి ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చేందుకు రకుల్‌ ఓకే చెప్పారు. అలా ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ చిత్రానికి సంతకం చేసి, షూటింగ్‌లో నాలుగు రోజులు పాల్గొన్నారు. అయినా తన లక్ష్యం మరొకటి కావడం, చిత్ర పరిశ్రమ తనకు సరైన రంగం కాదనుకోవడం వల్ల ఈ చిత్రాన్ని వదిలిపెట్టినట్లు రకుల్‌ పేర్కొన్నారు.
రకుల్ తప్పుకోవడం తో రకుల్ స్థానం లో కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఆ తరువాత సందీప్ కిషన్ నటించిన 'వెంకటాద్రి ఎక్సుప్రెస్' తో రకుల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కూడా అమ్మడు కి మంచి పేరే తెచ్చి పెట్టింది. ఇక రకుల్ వదులుకున్న మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ ప్రభాస్ కెరీర్ లో నే ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇందులో నటించిన కాజల్ మరియు తాప్సి లకు మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: