టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ది ఒక ప్రత్యేక స్థానం 100% లవ్ సినిమా తో యువ హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ తరువాత మంచి మంచి సినిమాలతో టాలీవుడ్ లో తనకొక ఇమేజ్ ఏర్పరుచుకున్నారు.బాహుబలి లో ప్రభాస్ సరసన నటించి తరువాత బాలీవుడ్ లో నూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 
ఇక ఈ టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ముద్దు సీన్ల పై పెదవి విప్పింది. కెమెరా ముందు ముద్దు సన్నివేశాల్లో నటించే ప్రసక్తేలేదని తమన్నా స్పష్టం చేశారు. కెరీర్‌ ఆరంభం నుంచి ఇలానే ఉన్నానని కథానాయిక తమన్నా అన్నారు. మొదటి నుంచి మంచి క్యారెక్టర్ ఉన్న సినిమాల్లోనే చేసానని ఏక్స్పోసింగ్ అసలు తనకు నచ్చదు అని చెప్పారు. ఈ భామ తమిళ స్టార్‌ విశాల్‌తో కలిసి నటించిన సినిమా ‘యాక్షన్‌’. నవంబరు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సి.సుందర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం మిల్కీబ్యూటీ గ్రీన్‌ బాడీసూట్‌ ధరించారు. అయితే దీన్ని ధరించేందుకు ఇబ్బందిపడ్డానని, కాస్త సందేహించానని చెప్పారు.
ఓ ఆంగ్ల ప్రతికకు ఇచ్చిన ఇంటర్వూ లో "నిజాయితీగా చెబుతున్నా.. బాడీ సూట్‌ వేసుకునేంత సరైన శరీరం నాకు లేదని తొలుత అనిపించింది. ఇలాంటివి ధరించేందుకు సరైన ఆకృతి అవసరం, అందుకే కాస్త ఆలోచించా. కేవలం ఆ ఒక్క సూట్‌ ధరించేందుకు డైట్‌ పాటించి, బరువు తగ్గాను. సాధారణ శరీరాకృతిలో ఇలాంటివి ధరిస్తే చూసేందుకు సరిగ్గా ఉండనేమో అనిపించింది. కెరీర్‌ ఆరంభం నుంచి నటిగా నాకంటూ కొన్ని హద్దులు ఉంచుకున్నా. ‘నా కాంట్రాక్ట్‌లోని నియమాల్ని నేను ఇప్పటికీ అలానే ఉంచాను. కెరీర్‌ ఆరంభం నుంచి వాటిని ఫాలో అవుతున్నాను. స్క్రీన్‌పై నిజంగా ముద్దు పెట్టుకోకూడదని అనుకున్నా.. అలానే ఉన్నా. ఈ విషయాల్లో రాజీపడను, ఎటువంటి మార్పులు చేయను" అని చెప్పింది తమన్నా.


మరింత సమాచారం తెలుసుకోండి: