ఒకప్పుడు టాలీవుడ్ లో దాదాపు తెలుగు వాళ్ళే హీరోయిన్స్ గా ఉండేవాళ్ళన్న సంగతి తెలిసిందే. సావిత్రి, జమున, భానుమతి, అంజలీదేవి..ఆ కాలం వేరు. మళ్ళీ తెలుగు చిత్ర పరిశ్రమ ఇలా తెలుగు అమ్మాయిలతో కళ కళ లాడుతుందంటే ఖచ్చితంగా అనుమానమే. ఆ రోజులే వేరు. ఇక ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో హిందీ భామల హవా ఎక్కువతున్న సంగతి తెలిసిందే. మన హీరోయిన్ల లిస్టు తీస్తే అధిక భాగం హిందీ భామలే ఉంటారు. మిగిలిన వారిలో కన్నడ మలయాళ తమిళ ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు. అయితే వీరందరినీ మన ప్రేక్షకులు ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. భాటియా.. అగర్వాల్.. కపూర్ .. ఇలాంటి నార్త్ అమ్మాయిలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా తెలుసంటే అది మన టాలీవుడ్ మహిమే. అయితే మొదటి నుంచి ఈ హీరోయిన్లందరూ తెలుగు సినిమాల్లో చేసేవారు కాబట్టి ప్రేక్షకులకు కాస్త నెమ్మదిగా అలవాటు పడ్డారు.

ఇక మన ఇండస్ట్రీలో రీసెంట్ గా పెద్ద ప్రాజెక్ట్ ఉందంటే చాలు బాలీవుడ్ లో ఉండే ఎవరైనా ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకు రావాలని చూస్తారు దర్శక, నిర్మాతలు. వాళ్ళకి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఈ సినిమాలలో నటింపజేస్తున్నారు. అయితే ఇంత చేసినా ఈ హీరోయిన్స్ మన ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నారా అంటే పెద్ద క్వశన్ మార్కే కనపడుతుంది. అందుకు రీసెంట్ ఉదాహరణ శ్రద్ధ కపూర్. ఈమధ్యే రిలీజ్ అయిన 'సాహో' లో శ్రద్ధ కపూర్ నటించడం బాలీవుడ్ మార్కెట్ కు ప్లస్ అయిందేమో కానీ శ్రద్ధ కపూర్ తెలుగు ఆడియన్స్ కు ఎంతమాత్రం నచ్చలేదు.  

ఇక రాజమౌళి చిత్రం ' ఆర్.ఆర్.ఆర్ ' లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ను ఎంపిక చేసుకున్నారు. అలియా మంచి నటి అనే విషయంలో సందేహం లేదు. అయితే తెలుగు ఆడియన్సు ఎంత మేరకు ఓన్ చేసుకుంటారనేది అనుమానమే. ఎందుకంటే తెలుగు తెలియని స్టార్ హీరోయిన్.. ఎవరైనప్పటికి ప్రేక్షకులు నచ్చాలి కదా. ఈ విషయంలో రాజమౌళికి కూడా చాలామంది సలహాలు ఇస్తున్నారని కూడా టాక్. అయితే ప్యాన్ ఇండియా మార్కెట్ కోసం తప్పనిసరిగా బాలీవుడ్ టచ్ ఇవ్వాల్సిందేనని జక్కన్న భావిస్తున్నారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇలా భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తీసుకొచ్చిన హీరోయిన్లు గతంలో ఎక్కువమంది ఫెయిల్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తుంటే టాలీవుడ్ కి 'సొమ్మూ పోయో.. అదీ పట్టే అన్న సామెత గుర్తొస్తుంది'.



మరింత సమాచారం తెలుసుకోండి: