సౌత్ సినీ ఇండస్ట్రీని టాప్ హీరోయిన్ గా పుష్కర కాలం పాటు ఏలేసిన అతి కొద్దిమంది హీరోయిన్లలో శ్రియ శరణ్ టాప్ లీగ్ లో ఉంటుంది. 2001లో ఇష్టం సినిమాలో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత స్లిమ్, గ్లామర్ తో ఉందో ఇప్పటికీ అంతే గ్లామర్ తో ఉంది. పెళ్లైనా శ్రియ అందంలో పెద్ద మార్పేమీ లేదంటే ఆశ్చర్యమే. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండే శ్రియ అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. భర్తతో కలిసి విదేశాలకు వెకేషన్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది.

 


రీసెంట్ గా ఓ స్విమ్మింగ్ పూల్ లో బికినీలో జలకాలాడుతున్న శ్రియ స్లో మోషన్ వీడియో వైరల్ అయింది. ఎద అందాలతో సరదాగా, ఉల్లాసంగా మత్సకన్యలా వెలిగిపోతోంది శ్రియ. ఈ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. “స్వచ్ఛమైన నీళ్లు.. మహా సముద్రమంత స్విమ్మింగ్ పూల్ లో ఆనందం.. అమ్మ తీసిన వీడియో” అంటూ తన వాల్ లో రాసుకుంది. జలకన్యలా నీటిలో మెరిసిపోతున్న శ్రియ వీడియోకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ వీడియోకు రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. “ఎన్నో ఏళ్లుగా చూస్తున్నా నీ అందం మాత్రం తరగలేదు”, “అందం మొత్తం నీ దగ్గరే ఉంది”, “ఇంత అందంగా ఉన్నావో..” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

 


స్వతహాగా కథక్ డ్యాన్సర్ అయిన శ్రియ.. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది. అడపాదడపా వచ్చే సినిమా అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేశ్ సినిమా కోసం నిర్మాతలు శ్రియను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. కెరీర్ ప్రారంభించి 18ఏళ్లు పూర్తైనా నిండైన అందంతో ఉండడం శ్రియ అదృష్టమే.


view this post on Instagram

No filter. Pure bliss. Ocean 🌊 infinity pool. Mom’s photography.

A post shared by @ shriya_saran1109 on

మరింత సమాచారం తెలుసుకోండి: