'బాహుబలి' సినిమా తో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించిన ప్రభాస్ పక్కన నటించడానికి చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన హీరోయిన్లే తెగ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ప్రభాస్ అవకాశం ఇస్తే అప్పుడు పక్కన నటించడానికి తెగ ఆరాటపడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రభాస్ కి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఊహించని షాక్ ఇచ్చినట్లు వార్తలు వినబడుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా స్టార్టింగ్ లో...వరుస అవకాశాలు దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తరువాత వరుసగా ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయి.


ఇటువంటి నేపథ్యంలో ప్రభాస్ పక్కన నటించే అవకాశం వస్తే రకుల్ ప్రీత్ సింగ్ నో చెప్పినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని తెలిపింది. విషయంలోకి  వెళ్తే మోడలింగ్ లో ఉన్న సమయంలో మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం నన్ను సంప్రదించారు. కానీ ఆ సమయంలో నాకు సినిమాల గురించి అవగాహన లేదు. మోడలింగ్ లోనే రాణించాలని అనుకునేదాన్ని. అప్పట్లో సినిమాల పట్ల ఆసక్తి లేక ప్రభాస్ చిత్రానికి నో చెప్పానని రకుల్ అంటోంది. కొంతకాలానికి వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.


ఆ చిత్రం విజయం సాధించడం.. రకుల్ గ్లామర్ కు అంతా ఆకర్షితులు కావడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. దీంతో ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలతో రకుల్ ప్రీత్ సింగ్ నటించడం జరిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సీక్వెల్ లో నటించి తాజాగా సినిమా విడుదల అయ్యి ఫ్లాప్ అవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎదురుచూస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: