రాజకీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి టైం చాలా చక్కగా నడుస్తుంది. చేసిన రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ కావడంతో మంచి జోరు మీద వున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల నటించిన 'సైరా' సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో నాన్ బాహుబలి రికార్డు టాలీవుడ్ ఇండస్ట్రీలో పగలకొట్టడం తో తర్వాత కొరటాల తో చేయబోయే సినిమా కోసం మంచి జోష్ మీద ఉన్నారు చిరంజీవి. ఇటువంటి నేపథ్యంలో కొరటాలతో చిరంజీవి చేయబోయే సినిమా గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాలుగా వస్తున్న తరుణంలో ముఖ్యంగా హీరోయిన్ విషయంలో అనేక వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్న నేపథ్యంలో వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంతో అవాస్తవాలు ఏంటో మెగా అభిమానులకు క్లారిటీ ఇవ్వడానికి డైరెక్టర్ కొరటాల సిద్దమైనట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా హీరోయిన్ విషయంలో వీలైనంత త్వరగా అధికారిక ప్రకటనను రిలీజ్ చేయాలనీ రామ్ చరణ్ కూడా దర్శకుడికి చెప్పినట్లు టాక్.  అయితే సినిమాలో అన్ని పాత్రలని సెలెక్ట్ చేసుకున్న తరువాతే అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాలనీ డైరెక్టర్ ఆలోచిస్తున్నారు. త్రిషతో సంప్రదింపులు జరిపిన మాట వాస్తవమే కానీ ఇంకా ఫైనల్ చేయలేదని టాక్ కూడా వస్తోంది. ఇదే క్రమంలో టైటిల్ కూడా ఏంటో తెలియజేయడానికి కొరటాల సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ నేపథ్యంలో కొరటాలతో చిరంజీవి చేయబోయే సినిమా డైరెక్టర్ ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి కొరటాల సినిమా కోసం బరువు తగ్గే పనిలో జిమ్ లో వర్కౌట్లు చేస్తూ స్పెషల్ డైట్ స్పెషల్ ట్రైనర్ ఆధ్వర్యంలో పాటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: