కొంతమంది భామలు చేతుల్లో పెద్దగా సినిమాల్లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం భలే చురుగ్గా ఉంటారు. అలాంటి వారిలో ఆదాశర్మ ఒకరు. తాజాగా ఆమె కన్ను కొట్టి వేళ్లనే పిస్తోలు గా మార్చి కుర్రకారు గుండెల్ని ఢమా ఢమా పేల్చే పనిలో పడింది. తమషా ఫోజులిస్తూ.. నేను పేలుస్తానంటే ఎవరైనా వద్దంటారా.. అదేలేండి ప్రేమతో అంటూ క్యాప్షన్ పెట్టేసింది.


అందమైన భామ ఒక కన్నుకొట్టి ప్రేమగా వేళ్లతో పేలుస్తుంటే.. కుర్రకారు మాత్రం ఆగుతారా చెప్పండి. అందుకే నా హృదయాల్ని పేల్చేశావ్ ఆదా అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ కమర్షియల్ గా ఓకే అనిపించింది. ఈ చిత్రంలో అదా శర్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. హార్ట్ ఎటాక్ లో అదా గ్లామర్, పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.


హార్ట్ఎటాక్ తర్వాత కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశం అదా శర్మ అందుకుంది. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం లాంటి చిత్రాల్లో అదా శర్మ నటించింది. రీసెంట్ గా అదా శర్మ రాజశేఖర్ కల్కి చిత్రంలో నటించింది. అదా శర్మ సోషల్ మీడియాలో చేసే గ్లామర్ ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. అందాల ఫోజులతో కుర్రకారు మతిపోగొడుతోంది.


అదా శర్మ చలాకీతనం, గ్లామర్ చూసి మంచి అవకాశాలు వస్తాయని భావించారు. కానీ అదృష్టం కలసి రాకపోవడంతో పూర్తిస్థాయి హీరోయిన్ గా ఆదాకు మరిన్ని అవకాశాలు రాలేదుఅదా శర్మ అందాలు ఆరబోస్తున్న ఫోజులని సైతం ఇంస్టాగ్రామ్లో గతంలో పోస్ట్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: