సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతదూరమైనా వెళ్లాల్సిన పరిస్థితి. ఆ నటి రావొద్దంటున్నా గెస్ట్ హౌస్ కి రావడానికైనా రెడీ అంటోందట. దర్శకనిర్మాతలు ఎవరు పిలిచినా కాదని అనడం లేదు. అయితే వద్దు అంటున్నా తాను మాత్రం వచ్చేస్తా! అంటూ వెంట పడుతుండడమే మరీ విచిత్రంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్టు కూడా ఉందండోయ్. గెస్ట్ హౌస్ కి వస్తే అదేరోజు తనకు అడ్వాన్స్ ఇచ్చి తప్పకుండా సినిమాలో ఛాన్స్ ఇవ్వాల్సిందేనట. లేదంటే మీ అంతు చూస్తానంటోందట.  

అయితే ఇలాంటి వారిని ఉద్ధేశించి అప్పట్లో ఒక బ్యూటి ఫుల్ హీరోయిన్ తో పాటు మరొక సీనియర్ దర్శకనిర్మాత కూడా చాలా ఘాటుగా కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. అసలు అమ్మాయిలు గెస్ట్ హౌస్ లకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి? అవకాశం కావాలంటే ఆఫీసులకు వెళ్లి ఫోటోలు ఇవ్వాలి కానీ! అంటూ ఆ పెద్దాయన స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చాడు. ఇక మరొక అందాల నటి అయితే .. తప్పు అమ్మాయిలదే ఉంటుంది. అందుకే అబ్బాయిలు చొరవ తీసుకుంటారు! అంటూ అసలు నిజం బయటకు చెప్పింది. అంతేకాదు అమ్మాయి అందంగా ఉంటే ఏ రంగంలోనైనా ప్రమాదమే కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

మరి ఈ రెండు రియల్ ఎగ్జాంపుల్స్ ని బట్టి అసలు మీటూ ఉద్యమం అన్నది అవసరమా..అసలు ఎందుకు?  రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ముందు గెస్ట్ హౌస్ లకు వెళ్లి.. ఆ తర్వాత తీరిగ్గా సమయం చూసుకుని ఐదు పదేళ్ల గ్యాప్ తర్వాత నాపై వేధింపులకు పాల్పడ్డాడు.. బలవంతం చేశాడు..అని హీరోలు.. దర్శకనిర్మాతలపై అరవడం వల్ల ఉపయోగమేంటి? అంటూ ఫిలింనగర్ వర్గాల్లోనే ముచ్చటించుకుంటున్నారు. పైగా తమపై వేధింపులు ఎదురైన రోజే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కొంతకాలం నింపాదిగా ఉండి ఇప్పుడు సతాయించడమేమిటి? అంటూ పంచ్ లు వేస్తున్నారు. అయినా సదరు నటి వద్దు మొర్రో అంటే గెస్ట్ హౌస్ కి వెళ్లడమేమిటి? కేవలం అడ్వాన్స్ చెక్ కోసం.. ఆఫర్ కోసం ఇంతకు దిగజారాలా?! అంటూ ఛీ కొడుతున్నారు. నిజమే గా మరి. ఏదైనా హద్దు దాటనంతవరకే..ఒకసారి హద్దు దాటితే..కుక్కలు చింపిన విస్తరేగా జీవితం. 



మరింత సమాచారం తెలుసుకోండి: