ట్రిపుల్ ఆర్ ఇపుడు టాలీవుడ్ తో పాటు దేశం మొత్తం చర్చినుకునే సినిమాగా మారింది.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్  విషయంలో జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  అటు మెగా ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీని ఫస్ట్ టైం కలిపి చేస్తున్న ఈ ప్రయోగం టాలీవుడ్ ని మరో మెట్టుకు తీసుకెళ్తుందని అంతా భావిస్తున్నారు.


శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ట్రిపుల్ ఆర్ మూవీలో ఇపుడు అల్లూరి పాత్రలో ఉన్న రామ్ చరణ్ సన్నివేశాలను  చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో కొమరం భీం గా జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న సంగతి విధితమే. ఎన్టీయార్ కి ఇంకా హీరోయిన్ని ఫిక్స్ చేయలేదు. మరో వైపు షూటింగ్ చాలా వరకూ జరిగిపోతోంది. మొత్తం ఏడు పాటలతో ట్రిపుల్ ఆర్ ఉంటుందని అంటున్నారు.


ఇందులో విప్లవ గీతాలు దేశభక్తి గీతాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.  ఇక ఈ మూవీ విషయంలో రాజమౌళి చెప్పిన డేట్ కే రిలీజ్ చేస్తాడని అంటున్నారు. 2020 జూలై 30న ట్రిపుల్ ఆర్ రిలీజ్ అంటున్నారు. ఈ డేట్ ని ఎట్టి పరిస్థితుల్లో మార్చరని కూడా అంటున్నారు. ఈ మూవీకి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ చాలా ఉందని చెబుతున్నారు.


అయితే అవన్నీ కొత్త ఏడాది చూసుకుంటారని, ఆరు నెలల పాటు ఆ వర్క్ ఫినిష్ చేసి అనుకున్న టైం కి ధియేటర్లలోకి పంపుతారని అంటున్నారు. ఇదిలా ఉండగా 2015లో జూలై 30న రిలీజ్ అయిన బాహుబలి పార్ట్ వన్ సూపర్ హిట్ అయింది. మళ్ళీ అదే డేట్ లో రిలీజ్ కొడుతున్న జక్కన్న మరపు రాని బ్లాక్ బస్టర్ ని ట్రిపుల్ ఆర్ ద్వారా అందుకుంటాడని అంటున్నారు. మొత్తానికి రిలీజ్ డేట్ కంఫర్మ్ చేయడం తో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ లో ఆనందానికి అవధులు లేవని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: