రాజకీయాలు.. సినిమాలు రెండు ఒకదానికొకటి సంబందం లేకున్నా ఇద్దరికి మంచి పరిచయాలు ఉంటాయి. తెర మీద హీరోలు, హీరోయిన్స్ గా పాలిటిక్స్ వారిని అభిమానిస్తే.. రియల్ లైఫ్ లీడర్స్ గా రాజకీయ నాయకులను సినిమా వాళ్లు గౌరవిస్తారు. అయితే సినిమాకు గ్లామర్ ఎక్కువ కాబట్టి కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు.


ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో రాజకీయ నాయకులు తమ ఇష్టాన్ని చూపిస్తుంటారు. అయితే వీరిలో కొందరు హీరోయిన్స్ పై విపరీతమైన ఇష్ఠాన్ని పెంచుకుంటారు. లేటెస్ట్ గా అలాంటి ఓ క్రేజీ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది.  తెలుగు పరిశ్రమలో ఓ హీరోయిన్ తో మంత్రి గారి తనయుడు రాసలీలలు ఆడుతున్నట్టుగా టాక్.


తనతో వచ్చిన హీరోయిన్స్ అంతా ప్రస్తుతం మంచి ఫాంలో ఉండగా ఆ హీరోయిన్ ఈమధ్య వెనుకపడ్డది. ఈ ఇయర్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో హిట్ అందుకున్న ఈ అమ్మడు మంత్రి గారి కుమారుడితో డేటింగ్ లో ఉందని అంటున్నారు. ఎలాగు సినిమా ఆఫర్లు లేవు కాబట్టి మంత్రి కొడుకుతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతుంది ఈ బ్యూటీ.     


ఈమధ్య ఈ భామకు పెళ్లంటూ వార్తలు రాగా తనకు అప్పుడే పెళ్లేంటి అంటూ షాక్ ఇచ్చింది. మంత్రి గారి కొడుకు మాత్రం ఈ హీరోయిన్ మోజులో పూర్తిగా మునిగిపోయాడట. ఇప్పుడప్పుడే అతని హ్యాంగ్ ఓవర్ దిగేలా లేదని తెలుస్తుంది. ఎలాగు సరైన ఛాన్సులు రావట్లేదు కదా అని మంత్రి కొడుకుతో డేటింగ్ తో కాలం వెళ్లదీస్తుంది సదరు హీరోయిన్. మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. అయితే ఈ హీరోయిన్ విషయం తెలిసిన దర్శక నిర్మాతలు ఆమెకు ఛాన్సులు ఇవ్వడానికి ముందు రావట్లేదు. అసలు ఆమెకు సినిమాలు చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది కూడా డౌటే అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: