ప్రముఖ క్యారెక్టర్ నటి సన తనయుడు సయ్యద్ అన్వర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా అన్వర్ బుల్లితెర నటి సమీర షరీఫ్ ని వివాహమాడారు. ఈ జంట వివాహం సోమవారం హైదరాబాద్ లో జరిగింది.వివరాల్లోకి వెళితే.. ఈ ఇద్దరూ చాలా కాలంగా స్నేహితులు. అలా ఉన్న వీరి ప్రేమ చిగురించింది దానితో పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ ఇద్దరు కలిసి తమిళ బుల్లితెరపై అనేక సీరియళ్లలో నటించారు. 


ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. తమ ప్రణయానికి గుర్తుగా అన్విరా పేరుతో ఇన్ స్టాగ్రమ్ లో రకరకాల సంగతుల్ని అభిమానులకు షేర్ చేస్తుంటారు.సయ్యద్ అన్వర్- సమీర జంట ఘనంగా కాకపోయినా కూడా సన్నిహితుల, స్నేహితుల మధ్య జరిగింది. సన కు సినీ ఇండస్ట్రీలో పరిచయాలు ఉండటంతో ఈ వివాహానికి అత్యంత్య సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.  


పెళ్లి వేడుకకు తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు నటీనటులు హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి అంతర్జాలంలో సందడి చేస్తోంది. దీనిని సన ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లోనూ షేర్ చేస్తున్నారు.ఇక క్యారెక్టర్ నటి సన క్రేజు గురించి తెలిసిందే. బుల్లితెర - వెండితెర అనే తేడా లేకుండా అన్నిచోట్లా రాణించారు. పూరి-కృష్ణవంశీ- వైట్ల సహా ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లు సనకు విరివిగా అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు. 


అయితే, సన నటనకు ఒక గ్రేడ్ మార్క్ ఉన్న్డటం వల్ల ఇటు సినిమాలలోను, అటు సీరియల్స్ లోని రాణిస్తూ ఉంది. అందుకే ఇప్పటికీ నాన్ స్టాప్ క్యారెక్టర్ నటిగా కొనసాగుతుండడం ఆసక్తికరం.సమీరా కూడా టీవీ సీరియల్స్ లో నటిగా ఆమంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ఎన్నో సార్లు ప్రభాకర్ తో సహజీవనం చేస్తుందనే వార్తలు విపడిన కూడా ఈమె పట్టించుకోలేదు. ఏది ఏమైనా సన ఇంటి కోడలైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: