స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ కు, రిలీజ్ కు ఇబ్బందులుండవు. కావలిసినన్ని ధియేటర్లు ఇస్తారు.. ఫ్యాన్సీ రేట్లకు కొంటారు.. ప్రేక్షకులు కూడా సినిమాపై ఇంటరెస్ట్ చూపిస్తారు. కానీ.. ఇందుకు వ్యతిరేకంగా ఓ టాలీవుడ్ టాప్ స్టార్ సినిమా కన్ఫ్యూజన్ లో ఉంది. పైగా మల్టీస్టారర్ సినిమా కూడా. ఇప్పుడు విడుదల చేయాలా వద్దా.. ఎప్పుడు విడుదల చేయాలి.. అంటూ మేకర్సే క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటున్నారు. ఆ సినిమానే ‘వెంకీ మామ’.

 


టాలీవుడ్ లో నలుగురు సూపర్ స్టార్స్ లో వెంకటేశ్ ఒకరు. ఆయన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి చేసిన సినిమా వెంకీ మామ. ఈ సినిమాకు మొదలైనప్పటి నుంచీ ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయింది. బాబీ దర్శకత్వంలో సురేశ్ బాబు ఈ సినిమా నిర్మించాడు. షూటింగ్ కూడా పూర్తైంది. కొన్ని స్టిల్స్ కూడా వచ్చాయి. పల్లెటూరు, పంచెకట్టులో ఉన్న వెంకీ, స్టైలిష్ గా ఉన్న నాగ చైతన్య.. పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ.. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంతో ఎవరికీ తెలీటం లేదు. అక్కినేని, దగ్గుబాటి కలయికగా వస్తున్న సినిమాగా ఉన్న అంచనాలను యూనిట్ నీరుగార్చేస్తోందని అంటున్నారు. డిసెంబర్ లో ఇప్పటికే పలు సినిమాల రిలీజ్ చేసుకుంటున్నాయి. సంక్రాంతికి నాలుగు సినిమాలు డేట్ లాక్ చేసేశాయి.

 


కానీ.. ఈ డేట్స్ లో ఎక్కడా వెంకీ మామ ఊసే లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సురేశ్ బాబుకు ధియేటర్ల సమస్య లేదు. సమస్యల్లా విడుదల తేదీ సెలక్ట్ చేసుకోవటమే. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న అని కొందరు, సంక్రాంతికి జనవరి 15న అని కొందరి నోటా వార్తలు రావడమే తప్ప అఫీషియల్ న్యూస్ లేదు. ఇప్పటికైనా పబ్లిసిటీతో పాటు డేట్ కన్ఫర్మ్ చేసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: