కేంద్ర మాజీ మంత్రి, నటుడు కృష్ణంరాజు (79) గత కొంతకాలంగా నిమోనియాతో వ్యాధితో బాధపడుతున్నారు. నిన్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది ఎదురవ్వగా చికిత్స కోసం బుధవారం రాత్రి బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించి ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.


ఇకపోతే ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని కేర్ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఇక ప్రస్తుతం కృష్ణంరాజు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. రాత్రి సమయం కావడం, చలి తీవ్రత కారణంగా న్యుమోనియా సమస్య మరింత తీవ్రతరమైందని డాక్టర్లు అంటున్నారట. కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలుస్తోంది. ఇకపోతే ఈ రోజు ఉదయం నుండే రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వస్తుండటం చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.


ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ప్రభాస్, కృష్ణంరాజు అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇక  ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు అసలు పేరు. కృష్ణంరాజు జనవరి 20, 1940న పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. కృష్ణంరాజు జీవితబాగస్వామి శ్యామలా దేవి వీరికి ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తేలు ఉన్నారు. ఇక 1970, నుండి 1980కాలంలో 183 తెలుగు సినిమాలలో నటించాడు.


ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాక కూడా. నాకు నువ్వు నీకు నేను, పలనాటి పౌరుషం, రెబల్, అన్నా వదిన, కుటుంబ గౌరవం లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో కూడా ఆయన నటించారు. ఇకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోక్‌సభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు.


ఆ తరువాత 13 వ లోక్‌సభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరి తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి కృష్ణంరాజు ఓడిపోయాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: