బాలలు అంటే భవిష్యత్తు వారసులు, వారు దేశానికి పెట్టుబడి. వారే రేపటి పౌరులు. ఒక విధంగా చెప్పాలంటే బ్యాంక్ లో దాచే కరెన్సీ కన్నా, ఒంటి మీద బంగారం కన్నా వెలకట్టలేని విలువైన సంపద బాలలు. వారికోసమే ఎవరైనా ఏదైనా చేయాలి. ప్రణాళికలు ఏమైనా రూపొందించాలి.  మరి బాలలు ఎక్కువగా ఉన్న అతి పెద్ద దేశంలో వారికి న్యాయం జరుగుతోందా.


అసలు ఇప్పటి బాలలకు వినోదాన్ని  పంచే సాధనాలు ఉన్నాయా అన్నది పెద్ద డౌట్. బాలల మెదళ్ళలో పుస్తకాలూ సిలబస్ కూరేసి వారిని మర మనుషులుగా తయారు చేస్తున్న విద్యా వ్యవస్థలో వారిలొని స్రుజనాత్మక శక్తిని వెలికి తీసే అవకాశాలు కల్పిస్తున్నారా. అసలు బాలల హక్కుల గురించి ఎవరికైనా అవగాహన ఉందా అన్నది పెద్ద చర్చ.


ఇక బాలలు విషయంలో చూసుకుంటే గతమంతా బంగారమేనని చెప్పాలి. అప్పట్లో టాలీవుడ్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. బాల నటులతో సినిమాలు తీసేవారు. రామాయణ భారత గాధలను బాలలతో సినిమాలు రూపొందించి  వారిలో నైతిక విలువలు పెంపొందించేవారు. ఇక్కడ లాభాపేక్ష చూసుకునే వారు.


బాలభారతం, బాల రామాయణం, నీడ వంటి సినిమాలు ఇలా బాలల కోసం వచ్చినవే. మరి ఇపుడు ఆ పరిస్థితి తెలుగు సినిమా రంగంలో  ఉందా అంటే లేదనే నిరాశ జవాబు వస్తుంది. అసలు వందల వందల కోట్లు పెట్టుబడిగా పెట్టి సినిమాలు తీసే వారికి బాలలు గుర్తుండకపోవడం బాధాకరమేనని అంటున్నారు. మరి బాలల  విషయంలో తీసుకుంటే ఇకైనైనా సినిమా మేకర్ల ఆలోచనలు మారాలి. అలాగే ఏదో రాయితీలు ఇస్తున్నామన్న తీరు కాకుండా పాలకులు ఈ విషయంలో శ్రద్ధ పెడితే వచ్చే ఏడాదికైన బాలల చిత్రాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆలోచన చేయాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: