ఇటీవలె విడుదలైన
బాలీవుడ్ మూవీ ‘బాలా’ మంచి విజయాన్ని సాధించింది. ఆయుష్మాన్ ఖురానా, భూమి పడ్నేకర్, యామీ
గౌతమ్ ప్రధాన పాత్రల్లో పోషించారు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో బట్టతల ఉన్నవారి బాధలను చూపించారు. ఇందులో హీరోకు భార్యగా యామీ
గౌతమ్ నటించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆమెకు నిజ జీవితంలోనూ బట్టతల ఉన్న వ్యక్తిని
పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ ‘ఎందుకు చేసుకోకూడదు’ అని సమాధానం ఇచ్చింది.
'నిజానికి బట్టతల ఉన్నప్పటికీ ఇటువంటి వారు చాలా శాంతస్వరూపులు. బట్టతల ఉన్న వ్యక్తులు ముందుగా వాళ్లని వాళ్లు ప్రేమించుకోవాలి. ఆ తర్వాతే మిగతావాళ్ల నుంచి ప్రేమని కోరాలి. మా సినిమాలోని ఉద్దేశం కూడా ఇదే' అని పేర్కొంది. కాగా, ఈ ప్రయోగాత్మక చిత్రానికి ప్రేక్షకులతో పాటు ఇటు విమర్శకుల నుంచీ ప్రశంసలు దక్కుతున్నాయి. అంటే అందం కంటే ముఖ్యం మనిషి తీరు మనసు ముఖ్యమని ఈ
భామ చెప్పకనే చెప్పింది. ఈ చిత్రంలో నటించడం మంచి ఎక్స్‌పీరియెన్స్, డిఫరెంట్ పాత్రలో నటించాను`` అన్నారు.
సినిమా విడుదలైన నాలుగు రోజుల్లో 52.20 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈమెకు దక్షిణాది కంటే ఉత్తరాది సినిమాల్లోనే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి.
ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో టీవీల్లో బాగానే ఫేమస్ ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమాల్లో మాత్రం కోరుకున్న విజయం రావడం లేదు. తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా కోరిన
సక్సెస్ రాలేదు.
అజయ్ దేవ్గన్,
హృతిక్ రోషన్ లాంటి హీరోలు కూడా యమీకి
సక్సెస్ తీసుకురాలేకపోయారు. కొరియర్ బాయ్ కళ్యాణ్".. "గౌరవం" లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ యమీగౌతమ్.