అక్కినేని నాగేశ్వరరావు జీవించి ఉన్నరోజులలో ఆయన పేరు మీద అక్కినేని ఫ్యామిలీ ఇచ్చే అక్కినేని నేషనల్ అవార్డ్స్ కార్యక్రమం క్రమం తప్పకుండా జరగడమే కాకుండా అత్యంత ఘనంగా ఆ అవార్డ్స్ కార్యక్రమం జరిగేది. అయితే అక్కినేని మరణం తరువాత ఈ అవార్డ్స్ కార్యక్రమం వరసగా జరగడంలేదు. అయితే ఇప్పుడు నాగార్జున ఈ అవార్డు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడమే కాకుండా అత్యంత ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు అక్కినేని నేషనల్ అవార్డ్ కు ఈ ఏడాది చిరంజీవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చిరంజీవి చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డ్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఈ కార్యక్రమాన్ని  భారీగా నిర్వహించడమే కాకుండా ఈ కార్య క్రమానికి జాతీయ స్థాయి రాజకీయనాయకులతో పాటు నేషనల్ సెలెబ్రెటీలను కూడ ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. 

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు కాని లేకుంటే రేపు కానీ ప్రకటిస్తారు అని తెలుస్తోంది. చిరంజీవి తల్లి అంజనా దేవికి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే విపరీతమైన ఇష్టమే కాకుండా ఆమె అక్కినేని నాగేశ్వరరావు వీరాభిమాని. అలాంటి అంజనా దేవి కొడుకు చిరంజీవికి ఇప్పుడు అక్కినేని నేషనల్ అవార్డు రావడం ఒక విధంగా యాదృచ్చికం అనుకోవాలి. 
సైరా’ మూవీతో చిరంజీవి కి జాతీయ స్థాయిలో అవార్డ్స్ వస్తాయి అని అందరూ ఆశిస్తున్న నేపధ్యంలో ఆ అవార్డ్స్ రాకుండానే చిరంజీవిని అక్కినేని నేషనల్ అవార్డు కు ఎంపిక చేసారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో మెగా అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు. ‘సైరా’ చిరంజీవి కోరుకున్న కలక్షన్స్ రికార్డులను ఇవ్వలేక పోయినా చిరంజీవికి మాత్రం నటుడుగా మంచి గౌరవం గుర్తింపు తెచ్చి పెట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: