స్మాల్ స్క్రీన్ పై క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న సుధీర్ రష్మిల మధ్య నిజంగా ఎలాంటి రిలేషన్ ఉంది. వారు చేస్తున్న షోలలో లవర్స్ గా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న వీరిద్దరు నిజంగా ప్రేమించుకుంటున్నారా.. లేక అలా నటిస్తున్నారా అంటే వయసు రీత్యా సుధీర్ రష్మిలకు మధ్య చాలా గ్యాప్ ఉంటుంది.


షోలో ఏదో అలా కలిసి వచ్చింది కాబట్టి లవర్స్ గా నటిస్తున్నారు. ఢీ లాంటి షోలో ఈ ఇద్దరు చేసే హంగామా ఆ షోకి చాలా ప్లస్ అవుతూ వచ్చింది. అయితే సుధీర్ రష్మిల మధ్య స్నేహం నిజమే కాని వాళ్లిద్దరు లవర్స్ గా మారే అవకాశం మాత్రం లేదట. సుధీర్ ఇంట్లో పెళ్లి చేసుకోమని ప్రెజర్ వస్తున్నా అతను ఇంకాస్త టైం కావాలని చెబుతున్నాడట.


ఇక రష్మి విషయానికి వస్తే ఆమె కూడా పెళ్లైపై అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది. సుధీర్ సంగతి ఏమో కాని రష్మి మాత్రం సోలో బ్రతుకే సో బెటర్ అని అనుకుంటుందట. కెరియర్ సాగినంత కాలం సాగించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటుందట. అయితే ఇప్పటికే 30 టూ 40 మధ్యలో ఉన్న రష్మి ఇంకా లేట్ చేస్తే ఎలా అంటున్నారు ఆమె ఫ్యాన్స్.       


పెళ్లి విషయంలో రష్మి అంత దృష్టి పెట్టడం లేదు ఎందుకు.. ఆమె నిజంగానే సుధీర్ ను పెళ్లాడేందుకు సుముఖంగా ఉందా అంటే అలా ఏం లేదు కాని ప్రస్తుతం కెరియర్ సాఫీగానే వెళ్తుంది కాబట్టి ఇలానే కొన్నాళ్లు సింగిల్ గానే ఉండాలని అనుకుంటుంది. సుధీర్, రష్మిల కెరియర్ విషయానికి వస్తే ఇద్దరికి బుల్లితెర మీద సూపర్ క్రేజ్ ఉంది. వారు ఏదైనా షో చేస్తున్నారు అంటే అది సూపర్ హిట్ అన్నట్టే. మరి ఈ ఇద్దరి సింగిల్ స్టేటస్ ఎప్పుడు మారుతుందో అని తెలుగు రెండు రాష్ట్రాల్లో అందరు ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: