టీవీ ఛానల్ వాళ్లు పాపులర్ అవ్వడానికి అనేకమైన ప్లాన్లు చేస్తూ ఉంటారు. నిజానికి టీవీ వాళ్ళ మధ్య కూడా రాజకీయంలో ఉన్నట్లే వ్యూహాలు, తంత్రాలు కోకొల్లలు. ఉదాహరణకి టీవీ9 ని తీసుకోండి.. వీ6 ఛానల్ లో ఉండాల్సిన బిత్తిరి సత్తి ని టీవీ9 కొనుక్కొని వీ6 పతనానికి నాంది పలికింది. తాను ఒక్కరే పాపులర్ అవ్వడం కాకుండా ఇతర ఛానళ్ళును కూడా బలహీనపరిచే విధంగా ఉంటాయి టీవీ వాళ్ల వ్యూహాలు. 


కొంతకాలంగా మా టీవీతో పోటీపడలేక చతికిలబడి పోతున్న జీ టీవీ కొత్త తెలుగు కామెడీ షో 'గ్యాంగ్ స్టార్స్' తో రాబోతున్నది. అయితే టీవీ9 వి6 లోని బిత్తిరి సత్తి ని ఎలా లాగేసుకుందో అదే రీతిలో జీటీవీ ఈటీవీ లోని జబర్దస్త్ నటులను లాగేసుకుంది. ఇప్పటికే మహా పాపులారిటీ ఉన్న హైపర్ ఆదిని, సుడిగాలి సుధీర్ ని, యాంకర్ ప్రదీప్ ని జబర్దస్త్ జడ్జి నాగబాబుని కొనుక్కున్నట్టు సమాచారం. తాజాగా సుడిగాలి సుధీర్, ఆది, యాంకర్ ప్రదీప్ ఉన్న 'గ్యాంగ్ స్టార్స్' షో లాంచింగ్ పోస్టర్ ని జీటీవీ విడుదల కూడా చేసింది. ప్రస్తుతానికి ఢీ షోకి హోస్ట్ చేస్తున్న సుధీర్ ప్రదీప్ జంప్ అవ్వడం ఈటీవీ కి పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు. ఢీ డాన్స్ షో జడ్జి శేఖర్ మాస్టర్ ని కూడా జీటీవీ వాళ్లు తీసుకున్నట్టు సమాచారం. 


ఈ మధ్య జరిగిన జీటీవీ గ్యాంగ్ స్టార్స్ ఈవెంట్ షూట్ కి సుధీర్, రవి, ప్రదీప్ తో పాటు నాగబాబు కూడా హాజరైనట్లు సమాచారం. అయితే ఈ షోకి కేవలం అతిథిగా హాజరయ్యాడా లేకపోతే గత నాలుగు జబర్దస్త్ ఎపిసోడ్స్ షూటింగ్స్ లో పాల్గొనని నాగబాబు కూడా శాశ్వతంగా జంప్ అయినట్లేనా? అనేది త్వరలోనే తెలుస్తుంది. నిజానికి జబర్దస్త్ షోకి అడుగడుగునా సలహాలిచ్చే నాగబాబు లేకపోతే ఈటీవీ లోని ఆ కామెడీ షో చతికలపడటం ఖాయం.


జీటీవీ గ్యాంగ్ స్టార్స్ ఎలా ఉండబోతుంది అంటే అచ్చం ఈటీవీ లోని ఢీ షోలో రౌండ్లు ఉన్నట్లే.. ఇంకా ఎపిసోడ్స్ ఉన్నట్లే ఉంటుంది. 16న అంటే శనివారం లంచ్ అయ్యే ఈ షో 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రసారమవుతుంది. అస్సలు విషయమేమిటంటే జబర్దస్త్ షోకి ఢీ షోకి దర్శకులైన భరత్, నితిన్ లను కూడా జీటీవీ లాగేసుకుంది. వీళ్లకు ఉన్న సృజనాత్మకత గ్యాంగ్ స్టార్స్ కామెడీ షోకి ఎంతో ఉపయోగపడి...ఈ షోని హిట్ చేస్తుందని నిస్సందేహంగా అనుకోవచ్చు. ఇప్పుడు ఈటీవీకి ఉన్న ఒకే ఒక్క రిలీఫ్ ఏమిటంటే బాగా నవ్వించే చమ్మక్ చంద్ర జబర్దస్త్ షోని వదిలి పెట్టకుండా ఉండటం. గ్యాంగ్ స్టార్స్ ప్రభావం జబర్దస్త్ పై ఎంతగా ప్రభావం చూపుతుందో చూడాలిక.


మరింత సమాచారం తెలుసుకోండి: