రాములమ్మ అని అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది విజయశాంతి. విజయశాంతి  తెలుగు సినీ నటి, నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు కూడా. విజయశాంతి  తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించడం జరిగింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మరియు హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "ద లేడీ సూపర్ స్టార్" మరియు "లేడీ అమితాబ్" గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది. ఆమె 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.


ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది. ఆమె నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది. 1985లో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది. విజయశాంతి పిన్ని విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే. 


ఆమె తెరపేరు లోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి గ్రహించబడింది. విజయశాంతి తన 7వ సంవత్సరములోనే బాలనటిగా సినీరంగములో ప్రవేశించినట్లు వినికిడి, కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు. ఆమెను కథానాయకిగా తెరకు పరిచయము చేసినది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్. సరిలేరు నీకెవ్వరు కొత్త సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంతో రెండు దశాబ్ధాల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్. 


ఇప్పటికే విజయశాంతి రీ ఎంట్రీపై భారీ హైప్‌ క్రియేట్‌ అవ్వటంతో చిత్రయూనిట్ కూడా ఆ అంచనాలను అందుకునే స్థాయిలో ఆమె క్యారెక్టర్‌ను తీర్చి దిద్దుతున్నారు.రాయల్‌ లుక్‌లో ఉన్న విజయశాంతి ఫస్ట్ లుక్‌ కొద్ది నిమిషాల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నైన్టీస్‌లో స్టార్ హీరోయిన్‌గా గ్లామర్‌ రోల్స్‌తో పాటు లేడి ఓరియంటెడ్‌ సినిమాల్లోనూ నటించిన విజయశాంతి, తరువాత పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి సినిమాలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆమె తరువాత యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: