‘తెనాలి రామకృష్ణ’ హీరో సందీప్ కిషన్ కెరియర్ కు పరీక్షగా మారడంతో  రేపు విడుదలకాబోతున్న ఈ మూవీని ఈరోజు సాయంత్రం కొన్నిచోట్ల ఉచితంగా చూపించబోతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది.  ఈ మూవీని కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో తీసారు కాబట్టి ఆ మూవీని కర్నూల్ లోని కొన్ని ధియేటర్లలో ఈ మూవీకి  ‘తెనాలి రామకృష్ణ’ అనే టైటిల్ పెట్టారు కాబట్టి తెనాలిలోని  కొన్ని థియేటర్లలో ఈ సినిమాను ఉచితంగా ఈరోజు ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందుగా ప్రదర్శించడం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతోంది.  

దీనితో ఈ సినిమా పై సందీప్ కిషన్ కు అంత నమ్మకం ఉందా అన్న కామెంట్స్ వస్తున్నాయి. ‘నిను వీడని నీడను నేను’ సినిమాతో తన ఫ్లాప్ ల సెంటిమెంట్ కు కొంత బ్రేక్ వేసుకున్నా సందీప్ కిషన్ రేపు విడుదల కాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. 

ఇప్పటికే ఈ సినిమా విడుదలకు ముందే సుమారు మూడు కోట్లకు స్టార్ మా ఛానెల్ ఈ సినిమా  రైట్స్ దక్కించుకోవడం హాట్ న్యూస్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘తెనాలి రామకృష్ణ బిఏబిల్‌' చిత్రంలో బాలీవుడ్ మూవీ 'జాలీ ఎల్‌ఎల్‌బి' తరహా కామెడి కనిపిస్తుందని అంటున్నారు. 

కామెడీ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్‌ అనిపించుకున్న నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ద్వారా తిరిగి తనకు క్రేజ్ ఏర్పడుతుందని సందీప్ కిషన్ భావిస్తున్నాడు. అయితే ఇలాంటి కామెడీ సీన్స్ ఎక్కువగా ‘జబర్దస్త్’ షోలలో చూసి చూసి విసిగి పోయిన ప్రేక్షకులు ఇలాంటి కామెడీ సినిమాలను చూస్తారా అన్నది సమాధానం లేని ప్రశ్న. హీరో సందీప్ కిషన్ కు హిట్ ఎప్పుడు వచ్చిందో గుర్తు కూడ లేని పరిస్థితులలో అతడి కెరియర్ అగమ్యగోచరంగా మారిన నేపధ్యంలో ఈ ఉచిత ప్రదర్శనలు ఈ సినిమాను ఎంత వరకు రక్షిస్తాయో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: