'అర్జున్ రెడ్డి' సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుత జనరేషన్ యువతరానికి ఆలోచనలకు తగిన విధంగా సినిమాను చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఒక పక్క విమర్శలు ఎదుర్కొంటున్న మరో పక్క తన లో సమాజం పై ఉన్న కోణాన్ని ఏమాత్రం భయం లేకుండా కామెంట్ల రూపంలో తెలియజేస్తూ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నారు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.


ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా అని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సందీప్ రెడ్డి వంగా గత కొంతకాలంగా హిందీలో సక్సెస్ అయిన లస్ట్ స్టోరీలను తెలుగులో  చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా సందీప్ రెడ్డి వంగాను సైతం ఎప్రోచ్ అయ్యారు నిర్మాతలు. అయితే ఆ వెబ్ సీరిస్ లో సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం తెలిసినా తనకు పరువు హత్య కథతో వెబ్ సీరీస్ చేయాలని సదరు సినిమా నిర్మాతలు చెప్పటంతో ఓకే అనుకున్నారట.


అయితే చివరాకరికి ఆ వెబ్ సిరీస్ లో సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో అది పూర్తిగా చదివిన పరిశీలించిన సందీప్ రెడ్డి వంగా ఆ ప్రాజెక్ట్ అక్కడితోనే వదిలేశారట. ఖచ్చితంగా అదే ప్రాజెక్టు తెరకెక్కించి ఉంటే తనపై అడల్ట్ డైరెక్టర్ అనే ముద్ర గ్యారెంటీగా పడేది అని ఇటీవల ఆంగ్ల పత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా తెలిపారు. ఇదే క్రమంలో తనకు లస్ట్, సెక్స్ అనే కాన్సెప్ట్‌లపై సినిమాకానీ, వెబ్ సీరిస్ గాని ఆసక్తి లేదని తేల్చేసాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఒక ప్రముఖ స్టార్ హీరోతో వర్క్ చేసే పనిలో స్క్రిప్టు విషయంలో రెడీ అవుతున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: