'షకీలా'.. ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే శృంగార తారగా నటించిన ఆమె సినిమాలు ఒక ఊపు ఊపాయి. అప్పట్లో తమిళ తెలుగు శృంగార సినిమాలు చేసిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు వాటికి చాలా దూరంగా ఉంటుంది. చాలా రోజులు సినిమాలకి దూరమైనా షకీలా.. తాజాగా సంపూర్ణ బాబు హీరో గా నటించిన 'కొబ్బరి మట్ట' సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. అయితే కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా.... క్యాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన శ్రీ రెడ్డి పై సంచలన కామెంట్స్ చేసింది. శ్రీరెడ్డి లాగా నేనేమీ నడిరోడ్డుపై బట్టలిప్పి నిలబడలేదు అనేసింది. 


ఇది విని కూడా కొన్ని రోజులపాటు నిశ్శబ్దంగానే ఉన్న శ్రీ రెడ్డి ..ఇటీవల షకీలా మాటలు పై స్పందించింది. షకీలా వ్యక్తిత్వం గురించి మాట్లాడిన శ్రీరెడ్డి ఊహించలేని పదజాలం వాడి అందరికీ భారీ షాక్ ఇచ్చింది. అవును! సహజంగా ఆమె చేసిన కామెంట్స్ లో ఏం ఉంటాయి? మీరు ఊహించిందే... అన్నీ పచ్చి బూతులు. కానీ షకీలా పై చేసిన కామెంట్స్ లో అన్ని మంచి పదాలే ఉన్నాయి. 


" షకీలా అంటే నాకు చాలా ఇష్టం. ఆమెకి ఫోన్ చేసి కూడా మాట్లాడాను.  ఆమె ఇంటర్వ్యూలు చాలా చూసిన తర్వాత తను ఉత్తమురాలు అని నాకు అర్థం అయింది." అంటూ ఉహించని రీతిలో శ్రీ రెడ్డి షకీలా పై కామెంట్ చేసింది. ఎవరూ ఏమీ అనకపోయినా అందరిపై మహా చెడ్డగా కామెంట్లు చేసే శ్రీరెడ్డి... షకీలా తన గురించి నెగిటివ్ గా మాట్లాడినప్పటికీ ఆమెను ఏమీ అనలేదంటే...అది నమ్మలేనటువంటి ప్రపంచ వింతే. దీనిపై అడల్ట్ స్టార్ షకీలా ఎలా స్పందిస్తుందో చుడాలిక.


మరింత సమాచారం తెలుసుకోండి: