టాలీవుడ్ ఎవర్ గ్రీన్ కింగ్ అక్కినేని నాగార్జున మన్మధుడు సీక్వెల్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మరొక సినిమా ఓకే చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు. గతంలో చాలా ఫ్లాపులు  పరాజయాలు చూసిన సందర్భంలో తర్వాత వెంటనే ఆ పరాజయం వాతావరణం నుండి బయటకు వచ్చి వెంటనే మరొక సినిమా అనౌన్స్ చేసి అభిమానులను అలరించే నాగార్జున మన్మధుడు సీక్వెల్ సినిమా ప్లాప్ అయిన తర్వాత మరొక సినిమా ఓకే చేయడానికి డైలమాలో పడిపోయినట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్. ముఖ్యంగా తన రెండో కొడుకు అక్కినేని అఖిల్ కి ఇప్పటిదాకా సరైన హిట్ పడకపోవడం మరోపక్క తాను చేస్తున్న సినిమాలు మొత్తం వరుసగా ఫ్లాప్ అవడంతో నాగార్జున అఖిల్ కెరీర్ పరంగా తన కెరీర్ పరంగా సినిమా ఓకే చేయడానికి చాలా ఆలోచిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.


నాగార్జున చివరి హిట్ సినిమా సోగ్గాడే చిన్ని నాయన తర్వాత మరొక విజయాన్ని ఇప్పటి వరకు చూడలేదు. ఇదే క్రమంలో సోగ్గాడే చిన్ని నాయన అలాంటి సినిమా హిట్ ఇచ్చిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథ విషయంలో కూడా సినిమా ఓకే చేయడం కోసం అనేకసార్లు స్క్రిప్టులో చేంజ్ చేయాలి అంటూ అనేక మార్పులు నాగార్జున సూచించారట. ఇంతగా తన నెక్స్ట్ సినిమా హిట్ అవ్వడం కోసం నాగార్జున చాలా టైం తీసుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున నెక్స్ట్ మొదలు పెట్టే సినిమా వార్త పెద్ద హాట్ టాపిక్ అయింది.


ఇదిలా ఉండగా కళ్యాణ్ కృష్ణ గారు చెప్పిన స్క్రిప్ట్ ఇటీవల మొత్తం విన్న నాగార్జున నవంబర్ రాత్రి నుంచి ఆ సినిమా స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అయితే నవంబర్ నెలాఖరు నుండి మొదలయ్యే ఈ సినిమా వచ్చే వేసవి కాలానికి ఎలాగైనా పూర్తి చేయాలనే ఆలోచనలో కింగ్ నాగార్జున ఉన్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: