2020 జులై 30న ట్రిపుల్ ఆర్ వస్తుందా ? రాదా ? అన్న డౌట్ చాలామందిలో ఉంది. రాదనే ప్రచారం జరుగుతున్నా.. అటు దర్శకుడు గానీ.. ఇటు నిర్మాత గానీ.. ఖండించడం లేదు. ఈ లెక్కలన్నీ రిలీజ్ వాయిదా పడుతుందన్న వార్తకు బలం చేకూర్చాయి. రాజమౌళి ఇవేమీ పట్టించుకోకుండా.. తన షూటింగ్ తాను చేసేసుకుంటున్నాడు. 


ట్రిపుల్ ఆర్ షూటింగ్ లేటవడం వెనుక చాలా కారణాలున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ గాయపడటంతో ఓ రెండు నెలలు షూటింగ్ వాయిదా పడింది. సైరా నిర్మాతగా ప్రమోషన్ లో పాల్గొనేందుకు 10రోజులు షూటింగ్ కు దూరంగా ఉన్నాడు చెర్రీ. రామ్ చరణ్ హీరోయిన్ గా అలియా భట్ ఎంపికైనా.. ఇంతవరకు సెట్స్ లోకి అడుగుపెట్టలేదు. ఎన్టీఆర్ కు జోడీగా ఫారిన్ అమ్మాయిని ఇంకా సెలక్ట్ చేయలేదు. 


ట్రిపుల్ ఆర్ జులై 30 రావాలంటే.. ఇప్పటికే 80శాతం షూటింగ్ పూర్తి కావాలి. విజువల్ ఎఫెక్ట్ కు ఎక్కువ స్కోప్ ఉండటంతో ఐదు లేదా ఆరు నెలల పాటు గ్రాఫిక్ వర్క్ లో ఉంటుంది. సినిమా ఇప్పటి వరకు 50శాతం కూడా పూర్తికాకపోవడంతో.. జులై 30న రావడం కష్టమేనంటున్నాయి ఫిలిం వర్గాలు. 


ట్రిపుల్ ఆర్ జులై 30న వస్తుందా? రాదా? అనే సంగతి పక్కనపెడితే.. ఆర్ఆర్ఆర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ పై కోర్టు సీన్స్ చిత్రీకరిస్తున్నారు. సీతారామరాజును బ్రిటీషర్స్ ప్రశ్నించే సన్నివేశాలు రాజమౌళి తీస్తున్నాడని తెలిసింది. 


బాహుబలితో రాజమౌళితో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. యుద్ధ సన్నివేశాల్లో అదిరిపోయే విజువల్ వండర్ తీసి  ప్రేక్షకులలో డ్రీమ్ డైరెక్టర్ అయిపోయాడు. రాజమౌళి త్రిపుల్ ఆర్ మూవీపై అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు రామ్ చరణ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: