ఏఎన్నార్ పురస్కారాలను అక్కినేని ఇంటర్నేషన్ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే  2018, 2019 సంవత్సరాలకు గాను ఏఎన్నార్ పురస్కారాలను అక్కినేని నాగార్జున ప్రకటించారు. సినీ నిర్మాత, రాజకీయవేత్త సుబ్బరామిరెడ్డితో కలసి ఈరోజు మీడియా సమావేశంలో పురస్కార విజేతల పేర్లను ప్రకటించారు. 2018-19కి గానూ దివంగత నటి శ్రీదేవి బోనీకపూర్‌తో పాటు, మరో సీనియర్‌ హీరోయిన్‌ రేఖ.. ఏఎన్‌ఆర్‌ అవార్డులను అందుకోనున్నారు. 


కాగా 2013లో ఏఎన్‌ఆర్‌ అవార్డును అందుకున్న అలనాటి అందాల నటి శ్రీదేవి మరోసారి ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం.  అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈనెల 17న నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను అందించనున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, అవార్డులను అందచేయనున్నారు. శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీకపూర్, జాన్వీకపూర్ ఈ  పురస్కారాన్నిస్వీకరించనున్నారు. 


మరోవైపు అన్నపూర్ణ కాలేజీ ఆఫ్‌ ఫిలిం అండ్‌ మీడియా (ఏసీఎఫ్‌ఎం) తృతీయ కాన్వకేషన్ (స్నాతకోత్సవం)ను కూడా నిర్వహించనున్నట్టు తెలిపింది.  సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది పరిశ్రమలోని సినీ ప్రముఖులను గుర్తించి ఏఎన్నార్‌ అవార్డును అందించడం జరుగుతోంది.  అవార్డు కింద రూ.5 లక్షల నగదుతో పాటు, జ్ఞాపిక కూడా అందజేస్తారు.


అయితే 2006లో తొలిసారిగా ఈ అవార్డును దేవ్‌ ఆనంద్‌కు అందించారు. అలనాటి మేటి నటి అంజలీదేవి (2007), నర్తకి, నటి వైజయంతిమాల (2008), నేపథ్య గాయని లతా మంగేష్కర్ (2009), దర్శకుడు కె. బాలచందర్ (2010), దర్శకురాలు హేమమాలిని (2011), రచయిత దర్శకుడు శ్యామ్ బెనగల్ (2012), బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ (2014),  సూపర్‌స్టార్‌ కృష్ణ(2015) ఈ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖులు. ఇక ఆ తర్వాత‌ 2017లో టాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: