ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక తెలుగు నటుడు. ఇతడు "ప్రభాస్"గా సుపరిచితుడు. ఇతను ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలి సాహో వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక అగ్ర స్థానాన్ని దక్కించుకున్నాడు.


ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణరాజు మరియు శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు ప్రముఖ నటులు గొపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్ ప్రభాస్ కు మంచి స్నేహితులు..2010లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ సరసన డార్లింగ్ సినిమాలో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నాడు.


 తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు. 2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్ తో కలిసి దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలో నటించాడు ప్రభాస్. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతో కలసి బాహుబలి సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం "బాహుబలి - ది బిగినింగ్ " తెలుగు, తమిళ, మలయాళ మరియు హిందీ భాషలలో జూలై 10 న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. 


రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న  విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం జరిగింది. ఇటీవల సాహో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: