నాగార్జున.. అక్కినేని నాగార్జున నిన్న మొన్నటి వరుకు బిగ్ బాస్ షో లో ప్రతి శని, ఆదివారం బుల్లితెర పై కనిపించి ప్రేక్షకులను అలరించిన నాగార్జున ఈరోజు మీడియా సమావేశం పెట్టారు. అందరూ ఎందుకు మీడియా సమావేశం పెట్టాడు అబ్బా అని అనుకున్నారు. అక్కడికి వెళ్ళాక తెలిసింది. నాగార్జున త్వరలోనే తన తండ్రి పేరు మీద ఏఎన్నార్ అవార్డుల వేడుక జరపబోతున్నాడు అని. 

       

అన్నపూర్ణ స్టూడియోస్ వేధికగా ఏఎన్నార్ అవార్డుల వేడుక జరపనున్నారు. అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అనేది తన తండ్రి కల అని, అతని పేరున్నంత వరుకు ఆ ఇవ్వాలనేది అతని కోరిక అని చెప్పాడు. అందుకనే నాన్న గారు స్వర్గస్తులు అయినా తర్వాత కూడా ఇప్పటికి అదే ఆనవాయితీ కొనసాగిస్తున్నట్టు అయన గుర్తుచేశాడు. 

            

కాగా 2018కి గాను ఏఎన్నార్ అవార్డు శ్రీదేవికి, 2019కి గాను రేఖ గారికి పురస్కారం ఇస్తున్నట్టు నాగార్జున వెల్లడించాడు. అయితే శ్రీదేవి అవార్డు తీసుకోవడానికి బోణి కపూర్ వస్తున్నారని అయన చెప్పారు. అయితే మీడియా సమావేశంలో కొందరు విలేకరులు నాగార్జునను ఈ ఏడాది 'ఏఎన్నార్ అవార్డుల' వేడుకకు సీఎం జగన్ వస్తారా అని ప్రశ్నించగా లేదు అని.. సీఎం జగన్ స్థానంలో చిరంజీవి వస్తున్నట్టు నాగార్జున వెల్లడించారు.  

      

అయితే సీఎం జగన్ స్థానంలో చిరంజీవి రావడం వెనుక అసలు కథ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. సీఎం జగన్ ను వేడుకకు రమ్మని ఆహ్వానించారా ? ఆహ్వానిస్తే నిరాకరించార ? ఏమైంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ వేడుకలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: