ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈటీవీ, ఈటీవీ ప్లస్ ఛానెళ్లలో ప్రసారమయ్యే జబర్దస్త్, పటాస్ కామెడీ షోలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఈ రెండు షోలు ప్రారంభమై సంవత్సరాలు దాటినా ఈ షోలకు క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. పటాస్ షో అంత పెద్ద హిట్ కావటానికి యాంకర్ రవి యాంకరింగ్ కారణం. జబర్దస్త్ షో హిట్ కావడంలో కమెడియన్ల టాలెంట్ తో పాటు రోజా, నాగబాబు పాత్ర కూడా ఉంది. 
 
కానీ పటాస్ షో నుండి రవి, జబర్దస్త్ షో నుండి నాగబాబు తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ ఈ షోల నుండి బయటకు వెళ్లిపోయారని గతంలో షూటింగ్ జరుపుకున్న ఎపిసోడ్స్ ఇప్పుడు ప్రసారమవుతున్నాయని తెలుస్తోంది. యాంకర్ రవి స్థానంలో యాక్టర్ నోయల్ లేదా చలాకీ చంటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రవి వెళ్లిపోవడానికి ముఖ్య కారణం రవి మరొక ఛానెల్ తో అగ్రిమెంట్ చేసుకోవడమే అని తెలుస్తోంది. 
 
మల్లెమాల సంస్థ షరతులు పెట్టడంతో రవి పటాస్ షో నుండి బయటకు వెళ్లిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ షో ప్రారంభమైనప్పటి నుండి నాగబాబు జబర్దస్త్ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ షోను డైరెక్టర్లు నితిన్ మరియు భరత్ డైరెక్ట్ చేసేవారు. కానీ కొన్ని కారణాల వలన వీరిద్దరూ జబర్దస్త్ షో నుండి తప్పుకున్నారు. సంస్థతో విబేధాలు రావటం వలన వీరిద్దరూ తప్పుకున్నారని వార్తలు వినిపించాయి. 
 
ఈ ఇద్దరు డైరెక్టర్లు జబర్దస్త్ షో నుండి తప్పుకోవటంతో  నాగబాబు సదరు డైరెక్టర్లతో ఉండే సాన్నిహిత్యం వలన తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. యాంకర్ రవి, నాగబాబు ఇద్దరూ పటాస్, జబర్దస్త్ షోల నుండి తప్పుకుంటే ఆ ప్రభావం ఈ షోలపై పడే అవకాశం ఉంది. నాగబాబు స్థానాన్ని జబర్దస్త్ షోలో ఎవరితో భర్తీ చేస్తారో చూడాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: