టాలీవుడ్ చందమామ ప్రమోషన్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. మ్యారేజ్ ఏజ్ కూడా దాటిపోతున్న కాజల్ లవ్ లో పడిపోయానంటోంది. ఈ మధ్య తరచూ సోషల్ మీడియాలో టచ్ లో ఉంటున్న చందమామ రీసెంట్ గా న్యూ బ్రాండెడ్ కాస్ట్యూమ్స్ తో నెటిజన్లను మురిపించింది.


కాజల్ అగర్వాల్ టాలీవుడ్ సీనియర్ మోస్ట్ హీరోయిన్. ఇండస్ట్రీకి వచ్చి ఒకటిన్నర ఒకటిన్నర దశాబ్దం దాటినా ఇంకా హీరోయిన్ గానే కొనసాగుతోంది. అంతేకాదు వావ్ అనిపించే గ్లామర్ మెయిన్ టైన్ చేస్తూ న్యూ ఏజ్ హీరోయిన్లకు కన్నుకుట్టేలా చేస్తోంది. అంతేనా ఈ జనరేషన్ భామలకు ఏ మాత్రం తీసిపోని విధంగా నిత్యం సోషల్ మీడియాలో ఆడియన్స్ తో టచ్ లో ఉంటోంది. ఎప్పటికప్పుడు సెల్ఫ్ ప్రమోషన్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 


కాజల్ అగర్వాల్ తాజా అన్ స్టాగ్రాంలో ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు మనీష్ అరోరా ఎక్స్ కూవ్స్ వారి సెక్విన్ డ్రెస్ తో లవ్ లో పడిపోయానంటూనే సెక్విన్ కలెక్షన్ డ్రస్సులు ఒక సెలబ్రేషన్ లాగా ఉన్నాయని క్యాప్షన్ ఇచ్చింది. మరి ఇదంతా జస్ట్ క్యాజువల్ గా పోస్ట్ చేసిందో.. లేదా పెయిడ్ ప్రమోషనో తెలియదు. అయినా పైసా లేకుండా కాజల్ ఇక్కడి పుల్ల అక్కడ పెట్టదని టాలీవుడ్ టాక్. ఇది కూడా కమర్షియల్ ప్రమోషన్ అంటున్నారు. ఏది ఏమైనా కాజల్ మాత్రం కలర్ ఫుల్ గా మెరిసిపోతోంది. 


అయినా హ్యాండ్ సమ్ మ్యాతో ప్రేమలో పడాల్సిన వయసులో కాజల్ సెక్విన్ డ్రెస్ తో ప్రేమలో పడటం ఏంటో అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే సెక్విన్ డ్రెస్ లో చందమామ అదిరిపోయింది. అందాల విందులు లేవు కానీ స్టైలిష్ గా మోడరన్ లుక్ లో సింప్లీ సూపర్బ్ గా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ భారతీయుడు 2తో పాటు హిందీలో ముంబై సాగా తెలుగులో కాల్ సెంటర్ అనే సినిమాల్లో నటిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: