హన్సిక మొత్వాని అందరికి గుర్తున్న..తెలిసిన పేరే. దేశముదురు సినిమాతో బన్ని సరసన నటించి టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమాలో పూరి జగన్నాధ్ హన్సికను అద్భుతంగా చూపించాడు. ఆ తర్వాత అడప దడపా సినిమాలు చేసినప్పటికి తెలుగులో స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అదే సమయంలో కాస్త బొద్దుగా కూడా అవడంతో నెమ్మదిగా తెలుగు సినిమాలలో అవకాశాలు తగ్గాయి. అయితే తమిళంలో మాత్రం ఈ బొద్దు గుమ్మకు వీపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే తమిళ తంబీలకు కావలసిందే బొద్దు బ్యూటీలు. అందుకే అక్కడ అసలు ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక తెలుగులో మాత్రం తను కావాలని గ్యాప్ తీసుకోలేదంటు బన్ని డైలాగ్ కొడుతుంది. 

నాకు తెలియకుండానే తెలుగులో గ్యాప్ వచ్చేసింది. తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం వల్ల తెలుగు సినిమాలు కొన్ని వదులుకోవాల్సి వచ్చింది. అందుకు ఉదాహరణ 'తెనాలి రామకృష్ణ' సినిమానే. ఒక దశలో ఈ సినిమా చేయలేనని కూడా అనుకున్నాను. డేట్స్ ఎడ్జెస్ట్ చేయడం చాలా కష్టమైంది. నిజానికి యూనిట్ నా కోసం కొన్ని రోజులు వెయిట్ చేశారు కూడా. ఇలా వేయిట్ చేయడం వల్లే ఈ సినిమా చేస్తూ మళ్ళీ తెలుగులో కనబడబోతున్నాను అంటు చెప్పింది. ఇలా తను తమిళ్ లో బిజీ అవ్వడం వల్లనే తెలుగులో గ్యాప్ వచ్చిందని హన్సిక చెప్పడం మాత్రం అంత నమ్మశక్యంగా లేదనిపిస్తుంది. ఇక తెనాలి రామకృష్ణ సినిమాతో మరోసారి తెలుగు తెరపై కొచ్చిన ఈ బ్యూటీ.. ఇకపై గ్యాప్ ఇవ్వనని, ఏడాదికి ఓ సినిమా కచ్చితంగా చేస్తానని అంటోంది. అయితే తను అనుకుంటే సరిపోతుందా..! తెలుగు సినిమాలలో ఛాన్సిచ్చే దర్శక, నిర్మాతలు..హీరోలు ఉండాలి కదా.

అసలు వాస్తవం ఏంటంటే.. హన్సిక కోలీవుడ్ లో ఏమంత బిజీగా లేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ చేసింది. మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అది ఈ ఏడాది వస్తుందో, వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతుందో తెలీదు. ఆమెకు కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు తగ్గాయి. అందుకే టాలీవుడ్ లో అవకాశాలు వెదుక్కుంటోంది. పైకి మాత్రం గ్యాప్ తీసుకోలేదు, వచ్చిందంటూ కలరింగ్ ఇస్తోంది. ఇదే కలరింగ్ అక్కడా ఇస్తుందని తెలుస్తోంది. ఇలా తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు తగ్గడంతోనే ఈ బొద్దు గుమ్మ ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ కు కూడా ఓకే చెప్పింది. మరి ఆ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటిస్తుందా..లేక రెగ్యులర్ క్యారెక్టరా అన్నది ఇంకా తెలీదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: