తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మలయాళి బ్యూటి అమలాపాల్. ఈ బ్యూటి ఫుల్ హీరోయిన్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే దర్శకుడు విజయ్ ను పెళ్ళి చేసుకుంది. అయితే ఇద్దరికి మనస్పర్దలు రావడంతో ఆయనతో చాలా తక్కువ కాలంలోనే విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత కమర్షియల్ హీరోయిన్ గా మళ్లీ బిజీ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. కాని అమలా కమర్షియల్ సక్సస్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఫ్లాపవుతున్నాయి. ఏదో కాస్త బన్ని తో చేసిన ఇద్దరమ్మాయిలతో, రాం చరణ్ తో చేసిన నాయక్ సినిమాలు అమల కు మంచి పేరును సంపాదించి పెట్టాయి. 

కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేయాలని అమలా పాల్ నిర్ణయించుకుందనిపిస్తుంది. ఎందుకంటే ఈమె వరుస గా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే నటిస్తోంది. అవే ఈ బ్యూటికి బాగా కలిసొస్తున్నాయి కూడా. ఆడై సినిమా లో ఓ రేంజ్ లో బోల్డ్ గా నటించిన అమలా పాల్ మరోసారి అలాంటి పాత్రనే చేసింది. ఫారెస్ట్ బ్యాగ్డ్రాప్ లో రూపొందిన కంప్లీట్ లేడీ ఓరియంటెడ్ సినిమాతో అమలాపాల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది.

'అదో అంద పార్వై పొల' అనే టైటిల్ తో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ లో అమలాపాల్ నటించింది. ఈ సినిమాలో అమలా ద్విపాత్రాభినయం చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇక అమలా పాల్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ను కూడా చేసినట్లుగా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. హీరోల కు జోడీగా అమలకి అవకాశాలు రాక పోవడంతో చేసేది లేక ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తూ వస్తోంది. ఇకపై కూడా అదే జోనర్ లో అమలా పాల్ సినిమాలు చేసే అవకాశం ఉందని.. కమర్షియల్ పాత్రలు తనకు రావడం అనుమానమే అనే కామెంట్స్ బాగానే వస్తున్నాయి. మరి అందరు అనుకున్నట్లు అమలా ఈ జోనర్ లోనే సాగుతుందా..లేక మళ్ళి మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలలో నటించే ఛాన్స్ అందుకుంటుందా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: