సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగి వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రం పరిస్థితి, అలానే ఈ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టిడిపి పార్టీ మరియు ఆ పార్టీ అధినేత చంద్రబాబులపై కొంత వ్యంగ్యంగా ఈ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ని బట్టి చెప్పవచ్చు. ఇక వారితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ని కూడా వర్మ ఈ సినిమా ద్వారా బాగానే టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొద్దిరోజులుగా వర్మ, 

టిడిపి పై అలానే చంద్రబాబు పై తనదైన రీతిలో తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దానికి ఒక ప్రధాన కారణం ఉంది, అదేమిటంటే గత ఏడాది వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రాలో రిలీజ్ కాకుండా ఆపడంతో పాటు, ఆ సినిమా విషయమై విజయవాడలోని ఒక హోటల్ లో ప్రెస్ మీట్ పెట్టబోయిన వర్మను అన్ని విధాలా అడ్డగించడం జరిగింది. ఇక ఆ అక్కడి నుండి వర్మ టిడిపి పై తనదైన శైలిలో సెటైర్లు వేయడం మొదలెట్టారు. 

ఇకపోతే ఈ కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ ని కూడా వ్యంగ్యంగా విమర్శించినట్లు తెలుస్తోంది. ఇకపొతే నేడు చిల్డ్రన్స్ డే సందర్భంగా చంద్రబాబు, లోకేష్  మరియు మనవడు దేవాన్ష్ కలిసి ఆడుకుంటున్నట్లుగా, తన సినిమాలోని పాత్రధారుల ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు వర్మ. అయితే దీనిపై కొందరు వర్మను సమర్దిస్తుంటే మరికొందరు మాత్రం, వర్మ మరీ చంద్రబాబు లొకేష్ లను ఎన్నికల్లో ఓడిపోయి, చిన్నపిల్లల్లా ఖాళీగా ఆడుకుంటున్న ఫోటో పెట్టడం సరైనది కాదంటూ ఆయన పై విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆ ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: