అదేమిటంటే, ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని, అయితే అందులో ఒక సాంగ్ మాత్రం జానపద సాంగ్ అని, అలానే ఆ సాంగ్ లో
ఎన్టీఆర్,
చరణ్ పోటాపోటీగా అదరగొట్టే రేంజ్ లో డాన్స్ చేస్తారని సమాచారం. నైట్ ఎఫక్ట్ లో ఎంతో భారీ ఖర్చుతో అతి త్వరలో ఈ సాంగ్ ని చిత్రీకరించబోతోందట
ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్. ఇక ఈ సాంగ్ రేపు
సినిమా రిలీజ్ తరువాత థియేటర్స్ లో దద్దరిల్లడం ఖాయమని సమాచారం. ఒకరకంగా ఈ న్యూస్ మెగా,
నందమూరి ఫ్యాన్స్ కి
గుడ్ న్యూస్ అయినప్పటికీ, మరొక బ్యాడ్ న్యూస్ కూడా ఈ సినిమాకు సంబంధించి వినపడుతోంది.
అదేంటంటే, ఈ సినిమాలో
అల్లూరి, భీం కలిసి నటించే సన్నివేశాలు అతి తక్కువ మాత్రమే ఉంటాయని, ఎక్కువగా ఎవరికి వారికి విడి విడిగానే సీన్స్ ఉంటాయని అంటున్నారు. అయితే వారిద్దరూ కలిసి కనిపించే సీన్స్ తక్కువే అయినప్పటికీ, వాటికి సినిమాలో ఎంతో మంచి ఇంపాక్ట్ ఉండనుందని చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రజారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం, మెగా మరియు
నందమూరి ఫ్యాన్స్ రేపు ఈ
సినిమా రిలీజ్ తరువాత థియేటర్స్ ని అల్లాడించడం ఖాయంగా కనపడుతోంది....!!