ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టిస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్న ఈ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీలో చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా సముద్రఖని, అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు వి విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చగా, కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విషయమై నేడు ఒక వార్త పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. 

అదేమిటంటే, ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని, అయితే అందులో ఒక సాంగ్ మాత్రం జానపద సాంగ్ అని, అలానే ఆ సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ పోటాపోటీగా అదరగొట్టే రేంజ్ లో డాన్స్ చేస్తారని సమాచారం. నైట్ ఎఫక్ట్ లో ఎంతో భారీ ఖర్చుతో అతి త్వరలో ఈ సాంగ్ ని చిత్రీకరించబోతోందట ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్. ఇక ఈ సాంగ్ రేపు సినిమా రిలీజ్ తరువాత థియేటర్స్ లో దద్దరిల్లడం ఖాయమని సమాచారం. ఒకరకంగా ఈ న్యూస్ మెగా, నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అయినప్పటికీ, మరొక బ్యాడ్ న్యూస్ కూడా ఈ సినిమాకు సంబంధించి వినపడుతోంది. 

అదేంటంటే, ఈ సినిమాలో అల్లూరి, భీం కలిసి నటించే సన్నివేశాలు అతి తక్కువ మాత్రమే ఉంటాయని, ఎక్కువగా ఎవరికి వారికి విడి విడిగానే సీన్స్ ఉంటాయని అంటున్నారు. అయితే వారిద్దరూ కలిసి కనిపించే సీన్స్  తక్కువే అయినప్పటికీ, వాటికి సినిమాలో ఎంతో మంచి ఇంపాక్ట్ ఉండనుందని చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రజారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం, మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ రేపు ఈ సినిమా రిలీజ్ తరువాత థియేటర్స్ ని అల్లాడించడం ఖాయంగా కనపడుతోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: