ఈ శుక్రవారం విడుదలైన సందీప్ కిషన్ 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్' సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తి కనిపించడంలేదు. కారణం సందీప్ గత సినిమాల ప్లాప్స్ వలన, అతని మార్కెట్ దారుణంగా పడిపోయిందన్న విషయం తెలిసిందే. సందీప్ గత చిత్రం 'నిను వీడని నీడని నేనే' సినిమా బాగున్నప్పటికీ... ప్రమోషన్స్ లేక కలెక్షన్స్ రాలేదు. అయితే సందీప్ కిషన్ తన 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్' సినిమాలో క్లైమాక్స్ కోసం సినిమా చూడాలి, అలాగే సినిమాలో హీరోయిన్ హన్సిక, ఇంకా సినిమాలో బోలెడన్ని చూడాల్సినవి ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. సినిమాపై అనుకున్నంతగా క్రేజ్ రావడం లేదు. సినిమా టాక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరి ఈ సినిమా ఇంకో రెండు రోజులైతే గాని పరిస్థితేంటో తెలుస్తుంది. 

బుక్ మై షో లో సందీప్ కిషన్ 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్' కి పెద్దగా బుకింగ్స్ కూడా కనిపించడం లేదు. మరోపక్క వరస హిట్స్ కొడుతూ తెలుగు మార్కెట్‌లోనూ దడదడలాడిస్తున్న విశాల్ యాక్షన్ సినిమాతో పోటీకి దిగాడు . ఈ సినిమాలో తమన్నా అందాలే హైలెట్ అనేలా తమన్నా అందాల ఆరబోత ఉందని ట్రైలర్, టీజర్ లోను కనిపిస్తుంది. అంతేకాదు సినిమాలో కూడా తమన్నా కేక అన్న టాక్ వినిపిస్తోంది. మరోపక్క సందీప్ కిషన్ 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్' ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగా ఉండటం తో ప్రేక్షకుల్లో అంతగా క్రేజ్ రాలేదు. మరి సందీప్ కిషన్‌కి ఈ సినిమా హిట్ అయితే హీరోగా మార్కెట్ నిలబడుతుంది. లేదంటే ఇప్పటి నుంచి కష్టమే. 

ఈ రెండు సినిమాలతో పాటు విజయ్ సేతుపతి నటించిన 'విజయ్ సేతుపతి' సినిమా కూడా టాలీవుడ్‌లో విడుదలైంది. ఈ సినిమాపై కూడా ఏమాత్రం అంచనాలు లేవు. కాకపోతే విజయ్ సేతుపతికి ఉన్న ఇమేజ్ వల్ల ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. ఇందులో రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. మరి ఈ మూడు చిత్రాలలో ఈ వారం బాక్సాఫీస్ దగ్గర సందడి చేసి హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ రాబడతాయో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: