ఒక సామాజిక వర్గం మీద విపరీతంగా దాడి చేసిన వైకాపా, ఇప్పుడు అకస్మాత్తుగా అదే సామాజిక వర్గ నేతలను ఎందుకు పార్టీలో చేర్చుకుంటుంది అనే అనుమానం సామాన్య ప్రజలకు వస్తుందేమో కానీ, జగన్/ వైకాపా రాజకీయం తెలిసినవాళ్ళెవరకీ రాదు.జగన్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఆ సామాజిక వర్గ నాయకులందరూ తెదేపా కి గ్లామర్ నాయకులు.యూత్ ని ఆకర్షించగల సత్తా ఉన్న నేతలు. 


ఇంత కాలిబర్ ఉన్న నేతలు తెదేపా లో ఉంటే సహజంగా అది వైకాపా కి ఎదురుదెబ్బ. అలా అని జగన్ వాళ్ళ కాలిబర్ చూసి ఆహ్వానిస్తున్నాడు అనుకోవటం పొరపాటు అవుతుంది. ఈ సో కాల్డ్ గ్లామర్ నాయకులందరు కూడా నీటిలో మొసలి లాంటోళ్ళు. ఆ నీళ్ల మడుగు తెదేపా. ఎప్పుడైతే వీళ్ళు తెదేపా ని వదిలిపెడతారో, అప్పుడు ఒడ్డునున్న మొసలి అవుతారు. జగన్ రాజకీయం అదే. వీళ్ళని ఒడ్డుకు తీసుకొచ్చి బలహీనులను చేస్తాడు. 



బలహీనులయ్యామని వాళ్ళకే తెలిసేలా చేస్తాడు, ప్రత్యర్థులకు తెలిసేలా చేస్తాడు, అప్పుడు పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. కనీసం మడుగులో కి తిరిగొచ్చే అవకాశం కూడా లేకుండా చేస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే ఆ సామాజికవర్గ నాయకులను ఆహ్వానించి వారి పొలిటికల్ కెరీర్ ని స్లోగా నాశనం చేస్తాడు. చూడటానికి ఆహ్వానించినట్లే కనిపిస్తుంది, మొసలికి ప్రతిరోజు తినటానికి నాలుగు కేజీల చికెన్ దొరుకుతుంది, కానీ మొసలి తన అసలు బలం అయిన మడుగుకు దూరం అవుతుంది.
 

మడుగు లో ఏనుగు ని కూడా చంపే సత్తా ఉన్న మొసలి చివరఖరికి చికెన్ తింటానికి అలవాటు పడుతుంది. ఏమాటకామాట చెప్పుకోవాలి, చికెన్ మాత్రం ఠంచనుగా కరెక్ట్ టైమ్ కి పెడతాడు. మొసలి దాన్ని గౌరవం అనే భ్రమలో ఉండిపోతుంది. ఈ నీతిని కథ ఎవరిదీ అర్థమయింది. ఏది చేసినా కూడా అధికారం అనేది ఉన్నంతవరకే. లేకుంటే మాత్రం ఎవరు పట్టించుకోరు అని ఈ సామెత తాత్పర్యం. 



మరింత సమాచారం తెలుసుకోండి: