తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ రియాల్టీ షో జబర్దస్త్ షో లో జడ్జిగా గత కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఇటీవల జబర్దస్త్ షో నుండి నాగబాబు బయటకు పూర్తిగా వచ్చేసినట్లు సమాచారం. ఈ కామెడీ రియాల్టీ షో మొదలయిన నాటి నుండి నాగబాబు మరియు రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. షో ఎంత పాపులర్ అయిందో అదేవిధంగా నాగబాబు మరియు రోజా న్యాయనిర్ణేతల జోడి కూడా అదిరిపోయింది. ఈ కామెడీ షో లో అదరగొట్టే టీం లతో కూడా నాగబాబు చాలా పర్సనల్ గా అటాచ్ అవుతూ సినిమా ఇండస్ట్రీలో వారికి అవకాశం వచ్చేలా వ్యవహరిస్తూ టెలివిజన్ రంగంలో కామెడీ చేసే నటీనటులకు సినిమా రంగంలో అవకాశాలు రావడం కోసం ఎంతగానో ప్రోత్సహించేవారు.


ఈ విధంగా జబర్దస్త్ షోలో గెటప్ శీను మరియు సుడిగాలి సుదీర్ వంటి కమెడియన్ లకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు రావడం వెనక నాగబాబు ఉన్నట్లు కూడా చాలా సందర్భాల్లో రుజువైంది. అంతగా జబర్దస్త్ కామెడీ రియాల్టీ షో తో అనుబంధం కలిగిన నాగబాబు తాజాగా జబర్దస్త్ షో నుంచి శాశ్వతంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు గురు, శుక్రవారాల్లో ప్రసారం అవుతున్నాయి.


నాగబాబు, రోజా నవ్వులు ఒక సిగ్నేచర్ లా మారిపోయాయి. కానీ ఇక నాగబాబు నవ్వులు జబర్దస్త్ షోలో కనిపించబోవడం లేదు. ప్రస్తుతం నాగబాబు కనిపిస్తున్న ఎపిసోడ్స్ అన్ని ఆల్రెడీ షూట్ చేసినవి. కొన్ని ఎపిసోడ్స్ తర్వాత నాగబాబు జబర్దస్త్ షోలో కనిపించరు. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ డైరెక్టర్స్ విషయంలో నాగబాబు యాజమాన్యంతో విభేదించినట్లు తెలుస్తోంది. దీంతో విభేదాలు సర్దుకోకపోవడంతో….నాగబాబు పూర్తిగా జబర్దస్త్ రియాల్టీ షో నుండి బయటకు వచ్చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: