టైటిల్ చూసి కాస్త కంగారు పడొచ్చు.. నాగార్జున కేవలం తెలుగు చల చిత్ర పరిశ్రమ వరకే హీరో.. కాని సల్మాన్ ఖాన్ బాలీవుడ్ యాక్షన్ హీరో. అలాంటి వారిద్దరి మధ్య ఎందుకు పోల్చాల్సి వచ్చింది అంటే.. ఇద్దరు బిగ్ బాస్ హోస్ట్ గా చేశారు కాబట్టి పోలిక జరిగింది. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ రియాలిటీ షోకి 13 సీజన్లుగా చేస్తూ వస్తున్నాడు.


అయితే ఇన్ని సీజన్లు చేసినా సరే నాగార్జున కేవలం ఒక్క సీజన్ తో ఏర్పరచిన రికార్డ్ ను సృష్టించలేకపోయాడు. సల్మాన్ హోస్ట్ గా బిగ్ బాస్ హింది మంచి రేటింగ్స్ కలిగి ఉన్నాయి. అయితే ఫైనల్ ఎపిసోడ్ రేటింగ్ లో మాత్రం మన తెలుగు బిగ్ బాస్ ను మించిన వాడే లేడని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ ను ఏకంగా నాలుగున్నర గంటలు తెలుగు ప్రేక్షకులు వీక్షించారు.     


ఈ ఫైనల్ ఎపిసోడ్ కు 18.29 టి.ఆర్.పి రేటింగ్ వచ్చిందట. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే హయ్యెస్ట్ అని చెప్పుకొచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు. నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ కు సైరా నరసింహా రెడ్డి అదేనండి మన మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఆయన రాకతో షో మీద అంచనాలు భారీగా పెరిగాయి.


ఇక హీరోయిన్స్ తో డ్యాన్సులు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రాహుల్ విన్నర్ గా ప్రకటించడంతో పాటుగా మిగతా ఇంటి సభ్యులతో చిరు మాట్లాడిన తీరు ఫ్యాన్స్ ను మెప్పించింది. ఫైనల్ గా బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ టి.ఆర్.పి లో టాప్ లేపేసిందని తెలుస్తుంది. ఇక సీజన్ 3 ముగిసింది.. సీజన్ 4 గురించి ఇప్పటి నుండే సిద్ధం చేస్తున్నారట. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కి మళ్లీ ఎన్.టి.ఆర్ నే హోస్ట్ గా తెచ్చే ఆలోచనలో ఉన్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: