సినిమాలకు పండుగ సీజన్లు చాలా ముఖ్యం. ఒక సినిమా ప్రారంభమయిందంటే అప్పటికి అరు లేదా ఏడెనిమిది నెలల ముందు ఏం పండుగలున్నాయి.. సెలవులున్నాయి.. అనుకుంటూ ప్లానింగ్స్ జరిగిపోతాయి. కొన్ని సినిమాలు రిలీజ్ డేట్ ను దృష్టిలో పెట్టుకుని ప్రారంభమవుతాయి. కానీ.. ఈసారి టాలీవుడ్ ఈ విషయంలో ఘోరంగా విఫలమయింది. భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టే విలువైన దీపావళి పండుగను చేజేతులా వదిలేసుకుంది. పండుగ కలెక్షన్నింటినీ రెండు తమిళ సినిమాలకు అప్పగించేసింది.

 


సైరా తర్వాత ఆహా.. ఓహో అనిపించే కలెక్షన్లున్న సినిమా ఒక్కటీ రాలేదు. ఏ సినిమా వచ్చినా రెండు.. మూడు రోజుల్లో చాపచుట్టేశాయి. దీపావళికి రెండు తమిళ సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి అంటే టాలీవుడ్ ఎంత వీక్ ప్లానింగ్ లో ఉందో అర్ధం చేసుకోవాలి. పండుగ కలెక్షన్లన్నింటినీ తమిళ సినిమాలకే వదిలేశారు. మీకు మాత్రమే చెప్తా, తిప్పరా మీసం.. వంటి సినిమాలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. సింగిల్ స్క్రీన్ ధియేటర్లైనా.. మల్టీప్లెక్స్ అయినా తప్పక సినిమా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. వీక్ కలెక్షన్లతో ప్రస్తుతం ధియేటర్లన్నీ బోసిపోతున్నాయి. ఈరోజు కూడా రెండు తమిళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏమాత్రం టాక్ ఏవరేజ్ గా వచ్చినా ధియేటర్లకు పరుగులు పెడతారు ప్రేక్షకులు.

 


డిసెంబర్ 20వరకూ పెద్ద హీరో సినిమా లేదు. సైరా తర్వాత వచ్చిన సినిమాల పరిస్థితి బాగోకపోయినా ధియేటర్లను రన్ చేస్తున్నారు నిర్వాహకులు. వెంకీమామ సినిమా రేపు రిలీజ్ పెట్టుకునుంటే బాలయ్య వచ్చే వరకూ కలెక్షన్లకు పోటీ ఉండేది కాదు. టాక్ బాగుంటే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేవారు. ప్లానింగ్ లోపంతో వచ్చే ఇలాంటి పరిస్థితులు సింగిల్ ధియేటర్లకూ.. సినీ పరిశ్రమకూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఇప్పటికైనా మేకర్స్ మేల్కొని సరైన ప్లానింగ్ తో వస్తారేమో.. చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: